Nag Ashwin: నాగ్ అశ్విన్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే కల్కి ఇండస్ట్రీ హిట్ గా మారలేకపోయిందా..? ఇంతకీ ఆ తప్పేంటి..?

ప్రస్తుతం పాన్ ఇండియా ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లే అతనికి ఆ స్థానాన్ని కల్పించాయని చెప్పాలి. నిజానికి బాలీవుడ్ హీరోలు ఎవరు అతనితో పోటీ పడడానికి కూడా ఇష్టపడడం లేదు. కారణం ఏంటి అంటే ఓడిపోతారనే భయంతోనే ఒక సెక్యూర్ జోన్ లో బతుకుతున్నారు. మరి మొత్తానికైతే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రభాస్ పేరు భారీ ఎత్తున వినిపిస్తూ ఉండడం విశేషం...

Written By: Gopi, Updated On : October 27, 2024 3:35 pm

Nag Ashwin

Follow us on

Nag Ashwin: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో కల్కి సినిమా భారీ సక్సెస్ గా నిలిచి భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. నిజానికి ఈ సినిమా 1200 కోట్ల వరకు కలెక్షన్లు అయితే రాబట్టింది. అయినప్పటికీ ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది. తప్ప బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకోలేక పోయింది. నిజానికి ఈ సినిమాలో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. ఇక దానికి తగ్గట్టుగానే ప్రతి విషయంలో నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని తెరకెక్కించాడు. ఇక ఏది ఏమైనా కూడా నాగ్ అశ్విన్ లాంటి డైరెక్టర్ ప్రభాస్ తో కల్కి లాంటి సినిమా చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి. ఇక కల్కి 2 సినిమా కోసం భారీ కసరత్తులను చేస్తున్న ఆయన ఆ సినిమాతో కూడా పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడనేది తెలుస్తోంది… ఇక ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే లాంటి స్టార్లతో నిండి ఉన్న కల్కి సినిమా ఎందుకు ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయింది అంటే ఆయన క్యారెక్టరైజేషన్ చాలావరకు సగటు ప్రేక్షకుడికి నచ్చలేదు.

అలాగే ఆయన డ్యూరేషన్ కూడా అంత పెద్దగా లేదు. ఇక దానికి తోడుగా ఆయన చేసిన ప్రతి సీన్ లో ఒక ఇంటెన్స్ డ్రామా ని క్రియేట్ చేయలేకపోయాడు. ఇవన్నీ సరిచేసుకొని ఉంటే కచ్చితంగా కల్కి సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టేది. ఇక సినిమా మొత్తం అమితాబచ్చన్ కనిపించాడు తప్ప ప్రభాస్ ఎక్కడ ఎలివేట్ అవ్వలేదు. అందువల్లే ఆయన క్యారెక్టర్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు.

తద్వారా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవలేదు అంటూ కొంతమంది సినీ క్రిటిక్స్ సైతం ఈ విషయం మీద వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా చేసుకోవాలనుకున్న ప్రభాస్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాడు తప్ప బ్లాక్ బాస్టర్ సక్సెస్ అయితే కొట్టలేకపోయాడు.

ఇక కల్కి 2 సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ని కొత్తగా డిజైన్ చేస్తున్న నాగ్ అశ్విన్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తే సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ హిట్టు కొడుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. చూడాలి మరి నాగశ్విన్ నెక్స్ట్ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడు అనేది…