Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ హీరో కోసం పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన లాంటి హీరో మరొకరు ఉండరు అనేది వాస్తవం. ఆయన వ్యక్తిత్వంలో గాని, సినిమాలు చేయడంలో గాని, ప్రజలకు సేవ చేయడంలో గాని ఏ విషయంలో చూసుకున్నా తనకు తానే పోటీ…అందువల్లే ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండడమే కాకుండా ప్రేక్షకులను మోటివేట్ చేసే విధంగా ఏదో ఒక సీన్ ను తన సినిమాలో పెడుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల భారీ కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక కెరియర్ మొదట్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎక్కువ సినిమాలను చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ బ్యానర్ లో సినిమా చేయడానికి ఇష్టపడడం లేదు. కారణం ఏంటి అంటే అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ మధ్య కొన్ని విభేదాలైతే ఉన్నాయి. అల్లు అరవింద్ ఎప్పుడూ తనని డీ గ్రేడ్ చేస్తూ మాట్లాడేవాడని పవన్ కళ్యాణ్ ఒకానొక సందర్భంలో తెలియజేశాడు. నిజానికైతే అల్లు అరవింద్ వైఖరి పట్ల పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచి కూడా సాఫ్ట్ కార్నర్ అయితే లేదు.
కానీ ఏదో చిరంజీవి వల్ల పవన్ కళ్యాణ్ తనని భరిస్తూ వచ్చాడు. మొత్తానికైతే ఇప్పుడు వాళ్లకి వీళ్ళకి మధ్య పెద్దగా మాటలు అయితే లేవనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అల్లు అరవింద్ బయట హీరోలతో సినిమాలు చేసుకుంటుంట, మెగా హీరోలు కూడా బయట ప్రొడ్యూసర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా తమను తాము స్టార్ హీరోలుగా మార్చుకోవడంలో మెగా హీరోలు ముందు వరుస లో ఉంటారు. ఇక ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు స్టార్ హీరోలు ఉండడం విశేషం. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను సెట్స్ మీద ఉంచాడు.
ఇక తొందర్లోనే ఈ సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…