Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు అంటే ఆయనకి సినిమా మీద ఎంత ఇష్టం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఒకప్పుడు చిరంజీవికి అల్లు అరవింద్ మద్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. వీళ్లిద్దరూ ఏం చేసినా కూడా కలిసికట్టుగా చేసేవారు. చిరంజీవి ఎలాంటి డిసీజన్ తీసుకోవాలి అనేది కూడా అల్లు అరవింద్ నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంటూ రెండు వేరువేరుగా విడిపోయి ఉండడం పట్ల పలు రకాల ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే వెలుబడుతున్నాయి. నిజానికైతే చిరంజీవి లేకపోతే అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా నిలబడే వాడు కాదు. అలాగే అల్లు అర్జున్ కూడా స్టార్ హీరోగా మారే అవకాశాలు లేకుండా పోయేవి. మొత్తానికైతే చిరంజీవిని వాడుకొని బాగా సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు అల్లు అరవింద్ బిహేవియర్ లో తేడా వస్తుంది అంటూ కొంతమంది సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా వీళ్ళ మీద చాలా కథనాలైతే వెలుబడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వీళ్ళ మధ్య మాటలు పెద్దగా లేనట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు ఎవరికి వారే ఉంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అందుకే చిరంజీవి విషయాల్లో అల్లు అరవింద్ ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఇంకా అల్లుఅరవింద్ దీనికి సంబంధించిన ఏ విషయంలో కూడా చిరంజీవిని ఇన్వాల్వ్ చేయకుండా అల్లు అర్జున్ తో కలిసి వాళ్లు సపరేట్ గా చేసుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి మొత్తానికైతే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనే ఒక ట్యాగ్ ని తగిలించుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే నడుస్తుంది. ఒకప్పుడు అల్లు అరవింద్ చిరంజీవి చాలా సన్నిహితులుగా ఉండేవారు. నిజానికి వీళ్ళిద్దరిని కృష్ణార్జునులు అంటూ పిలిచేవారు.
మరి ఇప్పుడు మాత్రం ఇలా ఎవరికి వారే విడిపోవడం పట్ల మెగా, అల్లు ఫాన్స్ లో కొంత వరకు నిరుత్సాహం అయితే ఎదురవుతుంది…ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది…