Srikanth Iyengar: పబ్లిక్ లో బూతుల దండకం, ప్రముఖ నటుడు చేసిన పనికి అందరూ షాక్! ఇంతకీ ఏమైంది?

ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో బూతుల దండకం అందుకున్నాడు. నా కొడుకులు అంటూ రెచ్చిపోయాడు. ఇంతకీ శ్రీకాంత్ అయ్యంగార్ కి కోపం ఎందుకు వచ్చింది? ఆయన ఎవరిని తిట్టాడు?

Written By: S Reddy, Updated On : October 27, 2024 12:13 pm

Srikanth Iyengar

Follow us on

Srikanth Iyengar: తెలుగు పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరు. ప్రతిరోజూ పండగే, బ్రోచేవారెవరురా వంటి చిత్రాల్లో కీలక రోల్స్ చేశాడు. ఆయన యాబైకి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన కీలక రోల్ చేసిన లేటెస్ట్ మూవీ పొట్టేల్. యువ చంద్ర, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలు చేశారు. పొట్టేలు మూవీ అక్టోబర్ 25న విడుదల చేశారు. పొట్టేలు మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్న శ్రీకాంత్ అయ్యంగార్ మీడియాపై అనుచిత కామెంట్స్ చేశారు.

నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. దరిద్రానికి విరోచనాలు వస్తే ఈ రివ్యూ రైటర్స్ పుడతారట. ఈ రివ్యూలు రాసే వాళ్లకు సినిమా అంటే తెలియదు. కనీసం రఫ్ ఐడియా కూడా ఉండదు. కనీసం షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేరు. ఒక సినిమా తీయడం ఎంత కష్టమో తెలుసా?. సినిమా ఎలా ఉందో చెప్పేందుకు ప్రేక్షకులు ఉన్నారు. ప్రేక్షక దేవుళ్ళు సినిమాను ఆదరిస్తారు… అంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన బూతు పదాలు మాట్లాడారు.

శ్రీకాంత్ అయ్యంగార్ తీరుపై తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. తమను కించపరుస్తూ మాట్లాడినందుకు గాను ఫిర్యాదు చేశారట. అతనిపై చర్యలకు సిద్ధం అవుతున్నారట. ఇక సినిమా రివ్యూల విషయంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. మూవీ విడుదలైన గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్న రివ్యూలు ఫలితాన్ని దెబ్బ తీస్తున్నాయనే వాదన ఉంది.

పలువురు నిర్మాతలు రివ్యూ రైటర్స్ , మీడియా సంస్థల మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ది ఫ్యామిలీ స్టార్ చిత్రానికి ఫస్ట్ షో నుండే నెగిటివ్ రివ్యూలు పడ్డాయి. ఆ మూవీ నిర్మాత దిల్ రాజు తన ఆవేదన వెళ్లగక్కాడు. అసలు మూవీ విడుదలైన రెండు రోజుల వరకు రివ్యూలు రాయకూడదు అనే నిబంధన తేవాలని అన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ వివాదం నేపథ్యంలో ఈ అంశం మరలా తెరపైకి వచ్చింది.