Jr NTR: ఎన్టీయార్ ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టకపోవడానికి కారణం ఏంటంటే..?

Jr NTR: ఎన్టీఆర్ చేసిన ఒక తప్పిదం వల్లే టాప్ 6 హీరోల్లో ఒకరి గా కొనసాగుతున్నారు. ఆయన కనక ఆ ఒక్క మిస్టేక్ చేయకపోయి ఉంటే ఇప్పటికీ నెంబర్ వన్ హీరోగా కొనసాగే వాడు...

Written By: Gopi, Updated On : June 26, 2024 11:25 am

What is the reason why NTR has not scored a single industry hit so far

Follow us on

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాస్ హీరోగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈయన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్టు కొట్టలేదనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక ముఖ్యంగా టైర్ వన్ హీరో అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీ హిట్ అయితే ఉండాలి. మరి ఎన్టీఆర్ కు ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇండస్ట్రీ హీట్ అయితే దక్కలేదు. మరి దేవర సినిమాతో ఏమైనా దక్కుతుందా అనేది చూడాలి. ఇక ఎన్టీఆర్ చేసిన ఒక తప్పిదం వల్లే టాప్ 6 హీరోల్లో ఒకరి గా కొనసాగుతున్నారు.

ఆయన కనక ఆ ఒక్క మిస్టేక్ చేయకపోయి ఉంటే ఇప్పటికీ నెంబర్ వన్ హీరోగా కొనసాగే వాడు అంటూ కొంతమంది సినీ విమర్శకులు సైతం ఆయన మీద విమర్శలైతే చేస్తుంటారు. ఇక కెరియర్ మొదట్లోనే ఈయన భారీ మాస్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక స్టార్టింగ్ లోనే తన టాలెంట్ మొత్తాన్ని చూపించిన ఆయన ఆ తర్వాత ఏం సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేదానిమీద క్లారిటీ లేకుండా పోవడంతో ఆయన కొద్ది వరకు తడబడ్డాడు.

Also Read: Celebrities Costumes: సినిమాలు, సీరియల్ లో వాడిన కాస్ట్యూమ్స్ ఏం చేస్తారు

ఇక టాప్ లెవల్లో చూసిన ఎన్టీయార్ ఎలాంటి సినిమాలు చేసిన జనాలకి నచ్చలేదు. ఇక మొదట్లోనే ఆయన కనక కొంచెం డీసెంట్ సినిమాలు, లవ్ స్టోరీస్ ని చేసుకుంటూ వచ్చి తర్వాత మాస్ హీరోగా ఎదిగితే ఆయన కెరీర్ అనేది సాఫీగా సాగిపోయేది… ఇక ఇప్పుడు ఉన్న టాప్ 6 హీరోల్లో ఒక ఎన్టీఆర్ ను మినహాయిస్తే మిగిలిన ఐదుగురికి కూడా ఇండస్ట్రీ హిట్ కనీసం ఒకటైన ఉంది. ఎన్టీయార్ విషయంలో ఎందుకిలా జరుగుతుంది. సింహాద్రి సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అది ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ కాలేకపోయింది.

Also Read: Kalki Movie: కల్కి కోసం రక్తం కారేలా కొట్టుకోబోతున్న భైరవ(ప్రభాస్),అశ్వద్ధామ(అమితా బచ్చన్)… ఎందుకంటే..?

ఇక ఎన్టీఆర్ ఒక్కడి మీద అయితే వర్కవుట్ అవ్వదనే ఉద్దేశంతోనే రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరిని పెట్టి సినిమా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ తనని తాను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా ‘దేవర ‘ సినిమాతో తను ఇండస్ట్రీ హిట్టు కొట్టాల్సిందే. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయిపోయే ప్రమాదం అయితే ఉంది…