https://oktelugu.com/

Tollywood Heroines: మొదటి సినిమాతోనే హిట్ సంపాదించిన హీరోయిన్ లు వీరే..

సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతో క్రేజీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుని చాలా సినిమాల్లో ఆఫర్లను సంపాదించింది. ఇప్పుడు కూడా ఈమె చేతిలో సినిమాలు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ తో జతకట్టి పాన్ ఇండియా రేంజ్ లో హిట్ ను సంపాదించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 26, 2024 / 11:25 AM IST

    Tollywood Heroines

    Follow us on

    Tollywood Heroines: కొందరు హీరోయిన్ లు మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ ను సంపాదిస్తుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు వరుస ఆఫర్లు వస్తాయి. కానీ ఆచితూచి అడుగులు వేస్తే మాత్రమే తర్వాత లైఫ్ ఉంటుంది. లేదంటే సినిమా ఇండస్ట్రీలో కనిపించడం కష్టమే. అయితే మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించిన కొందరు హీరోయిన్ ల గురించి ఇప్పుడు చూసేద్దాం.

    మృణాల్ ఠాకూర్: సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతో క్రేజీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుని చాలా సినిమాల్లో ఆఫర్లను సంపాదించింది. ఇప్పుడు కూడా ఈమె చేతిలో సినిమాలు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ తో జతకట్టి పాన్ ఇండియా రేంజ్ లో హిట్ ను సంపాదించింది.

    కీర్తి సురేశ్: కీర్తి సురేశ్ కూడా తోలి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. నేను శైలజలో అమ్మడు నటనకి ఫిదా అయ్యారు కుర్రాళ్లు . కానీ ప్రస్తుతం ఈమె చేతిలో ఎక్కువగా సినిమా అవకాశాలు లేనట్టుగానే కనిపిస్తుంది. కానీ దసరా సినిమాతో దేశం నలుమూలలా అభిమానులను సంపాదించుకుంది అమ్మడు.

    కృతిశెట్టి, ఇవానా: తొలి చిత్రం ఉప్పెన సినిమాతో కృతి శెట్టి తెలుగులో ప్రేక్షకుల మనుసును గెలుచుకుంది. చాలామందికి ఫేవరేట్ హీరోయిన్ అయిపొయింది ఈ బ్యూటీ. ఓరచూపులు, కొంటె నవ్వులతో కుర్రాళ్లను ఫిదా చేసింది. 2022 లవ్ టుడే అనే రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ లో హీరోయిన్ గా సౌత్ కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంది బ్యూటీ ఇవానా. ఈమె కూడా మంచి పేరు సంపాదించింది.

    వైష్ణవి, శివాని: బేబీ అనే రొమాంటిక్ డ్రామా చిత్రంలో కథానాయకిగా నటించి వైష్ణవి చైతన్య తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఏకంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే మంచి సక్సెస్ ను సాధించింది.
    అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో తొలిసారి హీరోయిన్ గా నటించి కుర్రాళ్ల చూపును తనవైపు తిప్పుకుంది శివాని నాగరం.

    అననతిక, మమితా బైజు: మలయాళీ బ్యూటీ అననతిక సనీల్‌కుమార్ తొలి సినిమా మ్యాడ్‌ లో జెన్నీగా తెలుగు కుర్రాళ్ల గుండెల్లో చోటు సంపాదించింది. ఇక రీసెంట్ గా వచ్చిన ప్రేమలు సినిమాలో కథానాయకిగా నటించిన మమితా బైజు.. తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనుసు దోచుకుంది.