Celebrities Costumes: సినిమాలు, సీరియల్ లో వాడిన కాస్ట్యూమ్స్ ఏం చేస్తారు

Celebrities Costumes: గతంలో మహేష్, సమంత నటించిన దూకుడు సినిమాలోని సమంత కాస్టూమ్స్ వేలం వేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా వేలం వేయగా వచ్చిన డబ్బును సమంత చారిటీ కోసం ఇచ్చారట నిర్మతలు.

Written By: Swathi, Updated On : June 26, 2024 10:56 am

Celebrities Costumes

Follow us on

Celebrities Costumes: ఒకసారి వేసిన డ్రెస్ లను మరోసారి వేయడానికి ఇష్టపడటం లేదు కొందరు. పండగలకు మాత్రమే బట్టలు కొనుక్కునేవారు. కానీ ప్రస్తుతం నెలకు ఒకటి రెండు సార్లు షాపింగ్ లకు వెళ్తున్నారు కొందరు. మరి సామాన్య ప్రజలే కొందరు ఒక ఫంక్షన్ కు వెళ్లిన డ్రెస్ లోనే మరో ఫంక్షన్ కు వెళ్లడానికి ఇష్టపడకపోతే సెలబ్రెటీలు ఒక సీరియల్ లో, సినిమాలో వేసిన కాస్టూమ్స్ మరొకసారి వేస్తారా? డౌటే లేదు అసలు వేయరు కదా.. మరి వాటిని ఏం చేస్తారు? అనే డౌట్ మీకు కలిగిందా? కానీ మీకు డౌట్ రాకపోయినా నేను డౌట్ వచ్చేలా చెప్పి.. ఆ తర్వాత ఆన్సర్ కూడా చేస్తాను గా.. సో ఫికర్ కైకూ.. ఆర్టికల్ చదివేసేయండి..

బట్టల నుంచి నగల వరకు ఒకసారి వాడితే మరొకసారి తిరిగి వాడటానికి ఇష్టపడరు సెలబ్రెటీలు. అయితే సాధారణంగా బుల్లితెరపై ప్రసామయ్యే సీరియల్స్ లో నటించే నటీనటులు ఆ సీరియల్ లో వారి పాత్రకు అనుగుణంగా కాస్టూమ్స్ వారే స్వయంగా తెచ్చుకుంటారట. కొన్ని సందర్భాలలో మాత్రమే నిర్మాతలు కొనుగోలు చేస్తారు. కానీ సినిమాల్లో మాత్రం ఇలా ఉండదండి బాబూ.. హీరోహీరోయిన్లకు కాస్టూమ్స్ అన్నింటిని కూడా నిర్మాతలే తీసుకురావాలి.

సినిమాలోని పాత్రల కోసం కాస్టూమ్స్ ఏ రేంజ్ లో డిమాండ్ చేసినా సరే నిర్మాతలు ఖరీదు చేయాల్సిందే.. ఆ భారం అంత వారే కచ్చితంగా భరించాలి. అయితే చాలా సార్లు మనం చూస్తుంటాం. హీరోహీరోయిన్ పేర్లతో లేదా సినిమాల పేర్లతో బట్టలు, నగలు వస్తుంటాయి, అరుంధతి చీర, అనార్కలి డ్రెస్, బూందీ డ్రెస్ అంటూ కొన్ని రకాల డ్రెస్ లు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. బూందీ డ్రెస్ కాజల్ ధరించిన దుస్తుల స్టైల్ ను బట్టి వచ్చింది. ఒకప్పుడు చిరుత డ్రెస్ కూడా ఫుల్ ఫేమస్.

సినిమాలోని హీరోహీరోయిన్ పాత్రకు అనుగుణంగా కాస్టూమ్స్ డిజైన్ చేస్తారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కాస్టూమ్స్ పై ప్రేక్షకులకు చాలా శ్రద్ద ఉంటుంది. అందుకే వీరి విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇలా డిజైన్ చేసిన కాస్టూమ్స గనక నటీనటులకు నచ్చితే వాటిని తీసుకుంటారట. నువ్వు ఎత్తుకున్న రాగమేంటి పాడుతున్న పాట ఏంటి అనుకుంటున్నారా? హెడ్డింగ్ ఒకటి కానీ దానికి సంబంధించి మ్యాటర్ లేదు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. అసలు సినిమాలో ఉపయోగించిన ఈ కాస్టూమ్స్ ను ఏం చేస్తారు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ కాస్టూమ్స్ నటీనటులకు నచ్చితే వారితో పాటే వాటిని తీసుకెళ్తుంటారు. మిగిలిన కాస్టూమ్స్ ను మాత్రం వేలం వేస్తారు.. వేలం పాట ద్వారా వచ్చిన డబ్బులను ఏదైనా చారిటీలకు ఇస్తారట.

గతంలో మహేష్, సమంత నటించిన దూకుడు సినిమాలోని సమంత కాస్టూమ్స్ వేలం వేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా వేలం వేయగా వచ్చిన డబ్బును సమంత చారిటీ కోసం ఇచ్చారట నిర్మతలు. ఇక గబ్బర్ సింగ్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ ధరించిన యూనిఫామ్ కూడా వేలం వేసి ఓ చారిటీ కోసం ఆ డబ్బును ఇచ్చారని తెలుస్తోంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సెలబ్రెటీలు వాడిన దుస్తులను వేలం వేసి వాటిని చారిటీలకు ఇవ్వడం మామూలుగా జరుగుతున్న ఒక మంచి ప్రక్రియ.

ఖుషీ పవన్ కళ్యాణ్ పాయింట్ ట్రెండ్…
ఖుషీ సినిమా వచ్చిన కొత్తలో పవన్ కళ్యాణ్ పాయింట్ కూడా వైరల్ గా మారింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాయింట్ కు ఎంత ఖర్చు అయిందో తెలియదు. కానీ బయట యూత్ ఆ పాయింట్ ను అప్పట్లోనే 2000 పెట్టి కొనడానికి వెనకాడలేదు. ఇప్పటికీ ఇలాంటి ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న సీతారామం చీరలు చాలా ఫేమస్ అయ్యాయి. అందులో అమ్మడు కట్టుకున్న చీర మగువలకు నచ్చడంతో ఆ చీరను ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అంటూ కొనుగోలు చేశారు.

బుల్లితెర కాస్టూమ్స్..
అయితే బుల్లితెరపై కొంత మందినటులు వేసిన కాస్టూమ్స్ ను మళ్లీ మళ్లీ వాడుతుంటారు కూడా. ఓ ఇంటర్వ్యూలో చిన్న కోడలు సీరియల్ నటి రూప కొన్ని నిజాలను బటయపెట్టారు. అయితే వీరు వేసిన కాస్టూమ్స ను తిరిగి వాడుతారట. కానీ వెంట వెంటనే వాడరని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఎవరైనా చూసినా వారికి గుర్తు రాదని అనుకుంటారట. . అందుకే చాలా రోజుల తర్వాత మళ్లీ వాటిని తిరిగి వాడుతారట. దీంతో పెద్దగా ఖర్చు ఉండదు. తిరిగి కొనాలనే టెన్షన్ కూడా ఉండదు. అందుకే అలా వాడుతారు అని చెప్పుకొచ్చింది ఈ నటి.