https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు తమిళ్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే..?

లుగు డైరెక్టర్లని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇక తను ఇప్పటికే మురుగ దాస్ ఎస్ జే సూర్య లాంటి ఇద్దరు తమిళ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇచ్చినప్పటికీ వాళ్ళిద్దరూ కూడా తనకి భారీ డిజాస్టర్లు ఇచ్చారు.

Written By: , Updated On : December 23, 2023 / 03:09 PM IST
Mahesh Babu

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు…ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడం తో పాటు గా కృష్ణ ఫ్యామిలీకి ఉన్న ఒక బ్రాండ్ నేమ్ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు తెలుగు డైరక్టర్ల తోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆయనతో సినిమాలు చేయడానికి తమిళ్ సినిమా డైరెక్టర్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ వాళ్లకు పెద్దగా అవకాశాలు అయితే ఇవ్వడు.

ఎందుకంటే ఆయన తెలుగు డైరెక్టర్లని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇక తను ఇప్పటికే మురుగ దాస్ ఎస్ జే సూర్య లాంటి ఇద్దరు తమిళ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇచ్చినప్పటికీ వాళ్ళిద్దరూ కూడా తనకి భారీ డిజాస్టర్లు ఇచ్చారు. దాంతో తమిళ్ డైరెక్టర్లను నమ్ముకోవడం కంటే తెలుగు సినిమా డైరెక్టర్లతో సినిమా చేయడం ఉత్తమమని ఆయన తెలుగు వాళ్ళతోనే సినిమాలు చేసుకుంటే వెళ్తున్నాడు.ఇక ఎస్ జే సూర్యతో ఆయన చేసిన నాని సినిమా ఆయనకు భారీ డిజాస్టర్ నివ్వగా, మురుగ దాస్ లాంటి స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన స్పైడర్ సినిమా కూడా తనకి అదే రిజల్ట్ ని ఇచ్చింది.

ఆయన పరాయి భాష డైరెక్టర్ లతో సినిమా చేసే కంటే మన డైరెక్టర్లతో చేయడమే మంచిదని మరోసారి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు… ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన మహేష్ బాబు సినిమాకు సంబంధించిన షూటింగ్ పనుల్లో బిజీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మహేష్ బాబు ఇంతకుముందు పరుశురాం డైరెక్షన్ లో చేసిన సర్కార్ వారి పాట సినిమా మహేష్ అనుకున్న సక్సెస్ ని ఇవ్వలేక పోయింది.

దాంతో ఆయన ఇప్పుడు వచ్చే గుంటూరు కారం సినిమా మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ సినిమా మీద చాలా రోజులు కేటాయించి ప్రతి సీను ని దగ్గరుండి మరి తనే చూసుకుంటూ అని షూట్ అయిన తర్వాత ఎడిటింగ్ లో కూడా కూర్చుని ఏ ఒక్క సినిమా బాగా రాకపోయినా కూడా దాన్ని మళ్ళీ రిషూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందువల్లే సినిమా లేట్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి…