https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 కోసం 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ 14 కోట్ల ట్యాక్స్ మాత్రమే పే చేయడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 18, 2024 / 01:40 PM IST

    Allu Arjun

    Follow us on

    Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కతూ ముందుకు సాగుతుంది. వివిధ భాషల్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క సినిమా కూడా ఏదో ఒక కొత్తదనాన్ని సంతరించుకొని వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క దర్శకుడు కూడా తమ సినిమాలతో వైవిధ్యాన్ని చూపించాల్సిన అవసరమైతే ఉంది…

    సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఏం చేసినా కూడా అదొక అద్భుతంగా ట్రీట్ చేసే అభిమానులు ఉంటారు. కాబట్టి వాళ్లు ఏ విషయంలోనైనా సరే ఆచితూచి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా చక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే సినీ సెలెబ్రిటీలు ట్యాక్స్ ని పే చేశారు అనే దానిమీద కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇండియాలో ఉన్న సినీ సెలబ్రిటీల్లో అత్యధికంగా షారుక్ ఖాన్ ట్యాక్స్ ను పే చేసినట్టుగా తెలుస్తోంది… ఇండియన్ గవర్నమెంట్ కి ఈయన 98 కోట్ల ట్యాక్స్ ని కట్టాడు… ఇక అతి తక్కువ పే చేసిన వాళ్లలో అల్లు అర్జున్ ఉన్నాడు. ఈయన 14 కోట్లను మాత్రమే పే చేసి చివరి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇది చూసిన చాలా మంది అల్లు అర్జున్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులకు కూడా ఒక డౌట్ అయితే వచ్చింది. అది ఏంటి అంటే పుష్ప 2 సినిమా కోసం 300 కోట్ల తీసుకున్న అల్లు అర్జున్ కేవలం 14 కోట్ల ట్యాక్స్ మాత్రమే పే చేయడం ఏంటి అంటున్నారు.

    ఇక పుష్ప 2 సినిమా కోసం ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ సరైనది కాదా కావాలనే ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని చేశారా? అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో లో వైరల్ అవుతున్న న్యూస్ ఈ సంవత్సరం ట్యాక్స్ పే చేసింది కాదట…

    వాళ్ళు గత సంవత్సరం ట్యాక్స్ పే చేసిన దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అంటే అల్లు అర్జున్ తో పాటు మిగతా సెలబ్రిటీలు ఎవరు కూడా ఈ సంవత్సరం పే చేయాల్సిన ట్యాక్స్ ఇంకా పే చేయలేదు. ఇక ఈ న్యూస్ తెలిసిన తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 కోసం 300 కోట్లు తీసుకున్న మాట నిజమే అంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి… తను ఈసారి ఏ రేంజ్ లో ట్యాక్స్ ను పే చేస్తాడు అంటు ఆయన అభిమానులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ ప్రస్తుతం టాప్ హీరో రేంజ్ ను టచ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడంలో తప్పు లేదంటూ సగటు ప్రొడ్యూసర్లు సైతం అభిప్రాయపడుతూ ఉండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న అల్లు అర్జున్ ఫ్యూచర్ లో ఎలాంటి సక్సెస్ లను నమోదు చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…