https://oktelugu.com/

Ram Charan and Allu Arjun : గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరు టాప్ హీరోనో తేలబోతుందా..?

ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : December 18, 2024 / 01:47 PM IST

    Ram Charan , Allu Arjun

    Follow us on

    Ram Charan and Allu Arjun : ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… పాన్ ఇండియాలో మంచి విజయాలను సాధించాలంటే దర్శకుడు ఎంచుకున్న కథలు కొత్తగా ఉండడమే కాకుండా స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా ఫ్రెష్ గా ఉండే విధంగా చూసుకోవాలి…

    మెగాస్టార్ తనయుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నా నటుడు రామ్ చరణ్…ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకునే విధంగా కథలను ఎంచుకొని మంచి గుర్తింపును సంపాదించుకునే దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉండడం విశేషం…ఇక ఆయన హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ సోలోగా పాన్ ఇండియా ఇండస్ట్రీ లో సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఆ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు హీరోలుగా ఉన్నారు కాబట్టి ఆ సినిమా భారీ విజయాన్ని సాధించిందనే వార్తలనైతే సంతరించుకుంటుంది.

    మరి ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ ఈ సినిమాతో తనకంటూ ఇక మంచి క్రేజ్ ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న ఈయన తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడనుంది…ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ భారీ విజయాన్ని సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

    మరి ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ ఎలాగైనా సరే గేమ్ చేంజర్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. మరి వీళ్లిద్దరిలో ఎవరు టాప్ హీరో అనేది తెలియాలంటే మాత్రం ఇప్పుడు రాబోయే గేమ్ చేంజర్ తెలియబోతుంది అంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు… ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను అయితే రాబట్టాల్సిన అవసరమైతే ఉంది. మరి ఈ మధ్యకాలం లో శంకర్ చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. ఈ సందర్భంగా సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది…

    ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటు ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే వాళ్ళ క్రేజ్ భారీగా తగ్గడమే కాకుండా మార్కెట్ పరంగా కూడా వాళ్లు కొంతవరకు వెనుకబడి పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు స్టార్ హీరోలందరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ సాధించాల్సిన అవసరమైతే ఉంది…