Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను సాధించాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ తో పోటీపడి సినిమాలను చేసినప్పటికీ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు నాగేశ్వరరావు ను డామినేట్ చేస్తూ వరుస సక్సెస్ లను అందుకుంటూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. ఇక నాగేశ్వరరావు కూడా ఎన్టీఆర్ కంటే తక్కువ ఏమి కాదు ఆయన కూడా మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీని చాలావరకు ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేశాడు. అందుకే ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇద్దరినీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కండ్లు గా భావిస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే నాగేశ్వరరావు కొడుకు అయిన నాగార్జున సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. మొదట్లో ఆయనకు యాక్టింగ్ రాదు. ఆయన చేసే సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వవు అంటూ చాలామంది ఆయన మీద చాలా విమర్శలు చేశారు. అయినప్పటికి నాగేశ్వరరావు మాత్రం నాగార్జున కెరీర్ ని గాడిలో పెట్టడానికి చాలా జాగ్రత్తలు తీసుకొని కొన్ని కాంబినేషన్స్ ను సెట్ చేశాడు. దానివల్లే నాగార్జున స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక దాంతో నాగార్జున వరుస సినిమాలు చేసి మంచి విజయాలను సాధిస్తూ వచ్చాడు. ఇక ఒకానొక సమయంలో నాగార్జున స్టార్ హీరో రేంజ్ ను కూడా టచ్ చేశాడు. ఇక ఇండస్ట్రీలో ఉన్న నలుగురు స్టార్ హీరోల్లో తను కూడా ఒకడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక ఇదిలా ఉంటే కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున చేసిన ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా చేయాలని వెంటనే చంద్రలేఖ అనే సినిమాని స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఆధ్యాంతం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉన్నప్పటికీ నిన్నే పెళ్లాడుతా కాంబోలో వచ్చిన సినిమా కాబట్టి దీని మీద భారీ అంచనాలైతే ఉండేవి.
దానివల్ల ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. తద్వారా ఈ సినిమా అయితే ప్లాప్ అయింది. ఇక ఈ మూవీ లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఉంది. దానికోసం మొదట నాగార్జున బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుఖ్ ఖాన్ ను సంప్రదించారట.
గెస్ట్ అపీరియన్స్ చేస్తే బాగుంటుందని నాగార్జున చెప్పినప్పటికీ షారుఖ్ ఖాన్ మాత్రం ఆ క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదు. దాంతో చేసేది ఏమీ లేక నాగార్జున సంజయ్ దత్ తో ఆ క్యారెక్టర్ ని చేయించాడు. అయితే అది సినిమాలో దాదాపు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉంటుంది.
సంజయ్ దత్ ఆ పాత్ర చేసిన కూడా సినిమాకి అది పెద్దగా హెల్ప్ అయితే అవ్వలేదు… ఒకవేళ షారుఖ్ ఖాన్ చేసి ఉంటే సినిమాకి మరింత రీచ్ వచ్చి ఉండేదని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…