Trivikram : ఒక సినిమా బాగా రావాలంటే ముందుగా ఆ సినిమా కథ బాగుండాలి. రచయిత రాసిన కథను దర్శకుడు సమర్థవంతంగా తెరకెక్కించినప్పుడే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. ఇక రచయిత కథను సరిగ్గా సమకూర్చలేనప్పుడు దర్శకుడు ఎంత ఎఫెర్ట్ పెట్టి విజువల్ గా చూపించిన కూడా అది అంత సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అవ్వదు. కాబట్టి సినిమాకి కథ అనేది చాలా ముఖ్యం. ఇక కొంతమంది రచయితలు దర్శకుల కాంబినేషన్ అయితే చాలా సక్సెస్ ఫుల్ గా వర్కౌట్ అవుతూ ఉంటుంది.
ఇక అలాంటి వాళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ విజయభాస్కర్ లా కాంబినేషన్ గురించి మన ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక వీళ్ళ కాంబినేషన్ లో చాలా సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా స్టార్ హీరోలకు సైతం వీళ్ళిద్దరూ కలిసి ఒక భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందించారు. అయితే కొంతకాలం తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమాలే రాలేదు. ఇంకా దాంతో అందరూ వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగి ఇద్దరు దూరమైపోయారేమో అందువల్లే వీళ్ళ కాంబో లో సినిమాలు రావడం లేదేమో అనే అనుమానాలను వ్యక్తం చేశారు.
కానీ అలాంటిదేమీ జరగలేదని విజయభాస్కర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. త్రివిక్రమ్ దర్శకుడు అయిన తర్వాత రచయితగా కథలు రాయడానికి ఆయనకు సమయం దొరకడం లేదని ఆయన కథల్ని ఆయన మాత్రమే రాసుకుంటున్నాడని అందువల్లే వాళ్ళ కాంబినేషన్ లో సినిమాలు రాలేదని తెలియజేయడం విశేషం…ఇక అలాగే విజయభాస్కర్ ‘ ఉషాకిరణాలు ‘ అనే సినిమా తీస్తున్నప్పుడు ఒక కొత్త నెంబర్ నుంచి తనకు త్రివిక్రమ్ ఫోన్ చేశాడట.
ఇక ఉన్న ఫలంగా ఆయన సెట్ కు వచ్చి తనతో కాసేపు లో గడిపి వెళ్లిపోయాడని కూడా చెప్పాడు. మొత్తానికిైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే త్రివిక్రమ్ దర్శకుడిగా మారడమే అసలైన కారణం అంటూ విజయ భాస్కర్ తెలియజేయడం విశేషం…