https://oktelugu.com/

Sukumar And Mahesh Babu: సుకుమార్ మహేష్ బాబు కాంబోలో సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి..? వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చేది అప్పుడేనా..?

ఆర్య సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు సుకుమార్... ప్రస్తుతం ఆయన చేస్తున్న 'పుష్ప 2' సినిమా డిసెంబర్ 6 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 2, 2024 / 04:47 PM IST

    Sukumar And Mahesh Babu

    Follow us on

    Sukumar And Mahesh Babu: స్టైలిష్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్…ఆయన తీసిన సినిమాలు స్టైలిష్ గా ఉండడమే కాకుండా చాలా ఇంటలిజెంట్ గా కూడా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ లో ఆయన తనకంటూ ఒక మార్కును చూపించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్లే ఆయన చేసిన సినిమాలకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్ చాలా ఫ్రెష్ గా ఉండడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. అందువల్లే సుకుమార్ తో వర్క్ చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు సైతం పోటీ పడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా రామ్ చరణ్ తో చేసిన ‘రంగస్థలం’ సినిమా అయితే సుకుమార్ కి నెక్స్ట్ లెవెల్ గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది.

    రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది. కానీ అది అనుకోని కారణాలవల్ల ముందుకు సాగలేదు. ఇక అదే కథతో సుకుమార్ అల్లు అర్జున్ తో ‘పుష్ప ‘ అనే సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    మరి పుష్ప సినిమాని మహేష్ బాబు ఎందుకు వదులుకున్నాడు అనే విషయం మీద అప్పట్లో పలు రకాల చర్చలైతే జరిగాయి. నిజానికి అల్లు అర్జున్ చేసినట్టుగా మహేష్ బాబు అంతా డీప్ గా ఆ క్యారెక్టర్ లో మెకోవర్ అయితే తీసుకు వచ్చేవాడు కాదనేది వాస్తవం. ఎందుకంటే అల్లు అర్జున్ ఆ సినిమాలో ఒక బస్తీలో పెరిగిన కుర్రాడు ఎలాగైతే ఉంటాడో అలా తన బాడీ లాంగ్వేజ్ కాని తన అవతారాన్ని కానీ మార్చుకొని చేసిన సినిమా అది…మహేష్ బాబుని అంతటి డి గ్లామర్ రోల్ లో చూడడానికి తన అభిమానులు ఇష్టపడరు. అందుకే తను ఆ క్యారెక్టర్ ను ఆ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికైనా వీళ్ళ కాంబినేషన్ లో ఒక మంచి సినిమా పడితే సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    అయితే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన వన్ సినిమా అది కమర్షియల్ గా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ ఈ సినిమా సక్సెస్ మాత్రం సాధించలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా వీళ్ళ కాంబినేషన్ లో ఒక భారీ హిట్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనేది…