Malaika Arora: చెత్తను చేతులతో క్లీన్ చేసిన నటి.. వైరల్ పిక్స్

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది మలైకా అరోర. తన వృత్తి గురించి పక్కన పెడితే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మరో వీడియో కూడా వైరల్ గా మారింది.

Written By: Swathi, Updated On : May 29, 2024 3:18 pm

Malaika Arora

Follow us on

Malaika Arora: రోడ్డు మీద చెత్త ఉంటే ఛీ డర్టీ పీపుల్స్ రోడ్డు మీదనే చెత్త వేస్తుంటారు అంటూ తిడుతూ ఆ వైపు కూడా మరోసారి తలెత్తి చూడరు. రోడ్డుపై చెత్త పడి ఉంటే మనకెందుకులే అనుకొని వెళ్తుంటారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం అలా తన మంచి మనసును చాటుకుంది. నడి రోడ్డుపై పడి ఉన్న చెత్తను నటి ఎత్తిపోగు చేసింది. చేతితోనే పట్టుకుని కొంత దూరంలో కనిపించిన ఓ డస్ట్ బిన్ లో పడవేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.

ఈ వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు సదరు నటిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ కొందరు మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. కెమెరాలు ఉన్నాయనే ఇలా చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ నటి ఎవరు అనుకుంటున్నారా? బాలీవుడ్ డో స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్, ఫిట్ నెస్ ఫ్రీక్ గా గుర్తింపు పొందిన నటి మలైకా అరోరా. పేరుకు హిందీ నటి. కానీ ఈమె టాలీవుడ్ తోనూ పరిచయముంది. పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ లో తన సూపర్ డ్యాన్స్ తో కేకలు వేయించింది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది మలైకా అరోర. తన వృత్తి గురించి పక్కన పెడితే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మరో వీడియో కూడా వైరల్ గా మారింది.

బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఫిట్ నెస్ ఫ్రీక్ గా గుర్తింపు పొందిన మలైకా అరోరా జిమ్ కు వెళ్లింది. అప్పుడే జిమ్ పరిసరాల్లోని రోడ్డు పై పడి ఉన్న చెత్తను చూసి.. తన చేతులతో వ్యర్థాలన్నింటినీ సేకరించింది. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న డస్ట్ బిన్‌లో పడేసింది ఈ నటి. దీనిని చూసిన ఒక నెటిజన్ మలైకాను కొనియాడుతూ..ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి వావ్ సూపర్ నటి అని కామెంట్ చేస్తే మరొక నెటిజన్ మలైకా మా హృదయాలను గెలుచుకుంటుంది అంటూ ప్రశంసించాడు. మరి కొందరు మాత్రం నెగటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.