https://oktelugu.com/

Rajamouli: దేవర మీద స్పందించని రాజమౌళి… కారణం ఏంటి..? ఎందుకీ మౌనం….

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు సూపర్ సక్సెస్ లను అందుకుంటు ముందుకు సాగుతున్నారు. అయితే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మాత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచాడనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 1, 2024 / 09:02 AM IST

    Rajamouli(2)

    Follow us on

    Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన దర్శకుడు రాజమౌళి…ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే రాజమౌళి ఎంటైర్ కెరియర్ లో చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేని ఒకే ఒక దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి. ఆయన తీసిన ప్రతి సినిమాని సక్సెస్ చేయడంలో ఆయనది అందవేసిన చేయి… ఇక ప్రస్తుతం ఇండియాలో తనను మించిన దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి రాజమౌళి తన సినిమాలే కాకుండా మిగతా వాళ్ళ సినిమాలు చూసి బాగుంటే ట్విట్టర్ ద్వారా గాని లేదంటే ఆ సినిమా సక్సెస్ ఈవెంట్ లో గాని పాల్గొని తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సినిమాని అందరూ చూడాలని ఆ సినిమాకు గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు. రీసెంట్ గా కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమా రిలీజ్ అయింది.

    రాజమౌళి ఎన్టీఆర్ మంచి స్నేహితులు కావడంతో రాజమౌళి మొదటి రోజు తన ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూశాడు. కానీ ఈ సినిమా ఎలా ఉంది, సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది. కొరటాల శివ డైరెక్షన్ ఎలా ఉంది. ఓవరాల్ గా సినిమా సక్సెస్ సాధించిందా? లేదా అనే విషయాల మీద రాజమౌళి ఏ రకంగా స్పందించకపోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు, అలాగే సగటు ప్రేక్షకులు కూడా రాజమౌళి మీద కొంత వరకు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.

    నిజానికైతే రాజమౌళి తనకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెబుతూ ఉంటాడు. కాబట్టి దేవర సినిమా తనకు నచ్చలేదని అందుకే తను తన అభిప్రాయాన్ని చెప్పడానికి సందేహిస్తున్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే రాజమౌళి మొదటి రోజే తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకునేవాడు. మరి ఎందుకు రాజమౌళి ఈ విషయంలో డిలే చేస్తున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీయార్ ఇద్దరు కలిసి దేవర సినిమాతో ఒక మంచి సక్సెస్ ని అందుకున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక జన్యూన్ టాక్ తెలియాలి అంటే మరొక కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఈ సినిమాకి ఎంత కలెక్షన్స్ వస్తాయనేది కూడా తెలియబోతోంది. ఇక మొత్తానికైతే చూడాలంటే వరుసగా ఏడోవ సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.