Rajamouli And Mahesh Babu: తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి ఒకరు. ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీదనే ప్రస్తుతం ఆయన పూర్తి ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ 1200 కోట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ద్వారా భారీ రికార్డులను కొల్లగొడతాడు అంటూ చాలామంది అభిమానులు రాజమౌళి మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి సినిమా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమా కోసం ఆయన దాదాపు 1200 కోట్ల వరకు బడ్జెట్ ని కూడా కేటాయించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని ఎప్పుడు ఇస్తున్నారనే విషయం మీదనే ప్రేక్షకులు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మహేష్ బాబు దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు రాజమౌళి కస్టడీలోనే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఆయన ఎలా చెప్తే మహేష్ బాబు అలా చేయాలి. లేకపోతే మాత్రం సినిమా అవుట్ పుట్ మీద తేడా కొట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు అనవసరంగా ఈ సబ్జెక్ట్ ని ఒప్పుకున్నానా అని ఇప్పుడు బాధపడుతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఎందుకంటే ఈ సినిమా ఇంకా కూడా స్టార్ట్ అవ్వడం లేదు. గుంటూరు కారం రిలీజ్ అయి దాదాపు పది నెలలు కావస్తున్నప్పటికి ఈ సినిమా మీద అసలు ఎలాంటి చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇక మహేష్ బాబు మాత్రం మేకోవర్ల మీద మేకోవర్లను చూపిస్తూ డిఫరెంట్ లుక్ ను ట్రై చేస్తున్నాడు. కానీ రాజమౌళి మాత్రం సినిమా ఎలా ఉండబోతుంది సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎలాంటి డేట్ ని కూడా మెన్షన్ చేయలేకపోవడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాని దసర తర్వాత నుంచి రెగ్యులర్ షూట్ కి తీసుకెళ్లడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది…ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం దాదాపు మూడు నాలుగు సినిమాలను వదులుకున్నట్టుగా కూడా తెలుస్తుంది…