https://oktelugu.com/

Prasanth Varma: ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమాను బాలీవుడ్ హీరోతో చేయడానికి కారణం ఏంటంటే..?

దర్శకుడు అయిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ కి సిక్వెల్ గా 'జై హనుమాన్' అనే సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 6, 2024 / 10:24 AM IST

    Prashanth Varma to do his next film with a Bollywood hero

    Follow us on

    Prasanth Varma: ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లో దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి చిన్న సినిమాల్లో పెద్ద విజయం గా నిలిచింది. ఇక ఇప్పటివరకు ఈ సంవత్సరం లో ఈ సినిమాను బీట్ చేసే సినిమా మరొకటి రాలేదనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ కి సిక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

    ఇక అందులో భాగంగానే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్వీర్ సింగ్ తో మరొక సినిమా చేయడానికి కసరత్తులైతే చేస్తున్నాడు. ఇక ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో తో సినిమా చేయడానికి గల కారణం ఏంటి తెలుగులో ఆయన కథలకి సరిపడా హీరోలు దొరకడం లేదా అనే విధంగా సోషల్ మీడియా వేదిక గా తెలుగు సినిమా అభిమానులు ప్రశాంత్ వర్మ ను ప్రశ్నిస్తున్నారు.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ప్రశాంత్ వర్మ రన్వీర్ సింగ్ నే తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఆ క్యారెక్టర్ ను ఆయన కోసమే రాసుకున్నాడట. అందువల్లే ఈ సినిమాను రన్వీర్ సింగ్ తో చేస్తున్నట్టుగా ఒకానోక సమయంలో తను క్లారిటీ ఇచ్చాడు. ఇక మొత్తానికైతే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా దున్నేయడానికి రెడీ అవుతున్నాడు.

    ఇక జై హనుమాన్ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుందనే అంచనాలైతే ఎప్పటి నుంచే మొదలయ్యాయి.ఇక శ్రీరామనవమి కానుకగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను అయితే రిలీజ్ చేశారు. ఇక ఆ పోస్టర్ ను చూసినప్పటి నుంచి ఈ సినిమా మరింత హైప్ ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుందనే చెప్పాలి…