Prabhas And Deepika Padukone: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పటివరకు పాన్ నేపద్యంలో తెరకెక్కుతున్న ప్రతి సినిమా విషయంలో ఆయా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక తెలుగు సినిమాలకి భారీ సక్సెసులైతే దక్కుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాకు తెరలేపిన విషయం మనకు తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రభాస్ ఎక్కువ సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నాడు… ఇక గత సంవత్సరం ఆయన హీరోగా వచ్చిన కల్కి సినిమాతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన దీపిక పదుకొనె సైతం ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ‘కల్కి 2’ సినిమా కోసం దీపిక పదుకొనే చాలా కండిషన్స్ ని పెట్టడంతో ఆమెను సినిమా నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.
మొదట దీపిక పదుకొనే ను హీరోయిన్ గా ఎంచుకున్నప్పటికి ఆమె పెట్టిన కండిషన్స్ తట్టుకోలేక సందీప్ ఆమెను తీసి పక్కన పెట్టాడు. మరి ఈ రెండు సినిమాల్లో కూడా ప్రభాస్ హీరో కావడం విశేషం… ప్రభాస్ తన సినిమాలో నుంచి దీపిక ను పక్కన పెట్టడం పట్ల ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు.
మరి తను ఎందుకని అలా మౌనాన్ని పాటిస్తున్నాడు. దీపిక విషయంలో ప్రభాస్ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు. అటు సినిమా మేకర్స్ ని గాని, ఇటు దీపికా పదుకొనేతో గాని ఎలాంటి డిస్కషన్స్ అయితే పెట్టడం లేదు. ఈ విషయంలో ప్రభాస్ ఇన్వాల్వ్ అవ్వద్దని అనుకుంటున్నాట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా దీపికా పదుకొనే ను సినిమా నుంచి తప్పించడం అనేది నిజంగా ఆమె అభిమానులు జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి…
ఇక దీపిక కూడా పెద్ద పెద్ద కండిషన్స్ పెట్టకుండా సినిమా మీద ఇష్టంతో ప్రొడ్యూసర్ ని బతికించే విధంగా ఆలోచిస్తే బాగుంటుందని, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ప్రొడ్యూసర్ తో ఖర్చు పెట్టించడం వల్ల సినిమా ప్రొడక్షన్ ఖర్చు పెరిగిపోతోంది. తద్వారా ప్రొడ్యూసర్ కి రావాల్సినంత ప్రాఫిట్స్ అయితే రాలేకపోవచ్చు అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…