Hardik Pandya Catch: టీమిండియాలో మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటాడు హార్దిక్ పాండ్యా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడు బ్యాటింగ్ చేస్తాడు. ఇటువంటి ఇబ్బందులలోనైనా బౌలింగ్ చేస్తాడు. తన వల్ల కాదు అనే పదం హార్దిక్ డిక్షనరీలో లేదు. అందువల్లే అతడిని ఈ కాలపు టీమిండియా యోధుడు అని పిలుస్తుంటారు. వైవాహిక జీవితం ముక్కలైనప్పటికీ.. ఆ ప్రభావం తన ఆట మీద లేకుండా చూసుకుంటున్నాడు హార్దిక్. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తూ.. అదే లెవెల్ లో బౌలింగ్ చేస్తూ.. అంతకుమించి అనే స్థాయిలో ఫీల్డింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు హార్దిక్.
ఆసియా కప్ లో భాగంగా
ఒమన్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ.. బౌలింగ్లో మాత్రం అదరగొట్టాడు. 46 బంతుల్లో ఏడు బౌండరీలు, రెండు సిక్సర్ల సహాయంతో 64 పరుగులు చేసి అత్యంత ప్రమాదకరంగా మారిన ఒమన్ ఓపెనర్ అమీర్ కలీమ్ ను వెనక్కి పంపడంలో హార్దిక్ పాండ్యా తన వంతు పాత్ర పోషించాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో కలీమ్ భారీ షాట్ కొట్టాడు. వాస్తవానికి అది బౌండరీ వెళ్తుందని అనుకున్నాడు. కానీ మెరుపు వేగంతో దూసుకు వచ్చిన హార్దిక్ ఆ బంతిని అమాంతం పట్టుకున్నాడు. అంతే వేగంతో.. తన శరీర స్థితిని నియంత్రించుకుంటూ ముందుకు సాగాడు.
కొరకరాని కొయ్యగా మారిపోయిన కలీమ్ ఆ బంతితో అవుట్ అయ్యాడు. దీంతో భారత శిబిరంలో నవ్వులు విరిశాయి. ఒకవేళ
కలీమ్ కనుక అవుట్ కాకపోయి ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. బ్యాటర్ గా విఫలమైనప్పటికీ.. ఫీల్డర్ గా హార్దిక్ సత్తా చాటాడు. తిరుగులేని లెవల్లో క్యాచ్ పట్టి భారత శిబిరంలో ఆశావాహ దృక్పథాన్ని నింపాడు. అతడు పట్టిన క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అన్నట్టు ప్రస్తుత ఆసియా కప్ లో ఇప్పటివరకు హార్దిక్ పట్టిన క్యాచ్ అత్యుత్తమం.
హార్దిక్ అద్భుతమైన క్యాచ్ పట్టిన నేపథ్యంలో సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. బ్యాట్ ద్వారా విఫలమైనప్పటికీ ఫీల్డర్ గా అద్భుతం చేశావంటూ అతడిని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గొప్ప ఆటగాడిగా జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించావంటూ హార్దిక్ పాండ్యాను నెటిజన్లు వెయ్యినోళ్ళ పొగుడుతున్నారు. బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యా కాచుకొని ఉంటే ప్రత్యర్థి బ్యాటర్లకు అవకాశం ఉండదని.. అది మరోసారి నిరూపితమైందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
HARDIK PANDYA – THE CLUTCH MAN. pic.twitter.com/B9qtAmVSd5
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2025