Serial Artistes: సినిమా ఇండస్ట్రీ లో అవకాశాల కోసం చాలామంది చాలా సంవత్సరాల పాటు ఎదురుచూస్తూ ఉంటారు. కొంతమందికి తొందరగా అవకాశాలు వస్తే మరి కొంతమంది మాత్రం చాలా సంవత్సరాల తర్వాత అవకాశాలు దక్కుతూ ఉంటాయి. మొత్తానికి ఎవరైనా కూడా ఇక్కడ అవకాశాలను దక్కించుకొని మంచి పేరు సంపాదించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే చాలామంది సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణించాలని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ తీవ్రమైన ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందువల్లే వాళ్ళు స్టార్ నటులుగా రాణిస్తూ ఉంటారు. సీరియల్స్ లో నటులుగా గుర్తింపు పొందిన వారు సైతం సినిమాల్లో నటించాలనే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి సినిమాల్లో పెద్దగా అవకాశాలైతే రావు. ఎందుకంటే ఒకసారి సీరియల్ లో నటించిన నటులను సినిమా దర్శకులు కూడా వాళ్ల సినిమాల్లో పెట్టుకోవటానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే సీరియల్ నటులు సీరియల్లో ఎలాగైతే నటిస్తారో అదే నటనకి అలవాటు పడి ఉంటారు. అది చాలా రోటీన్ బోర్ గా ఉంటుంది.కాబట్టి వాళ్లు సినిమా నటనకు వచ్చేసరికి అంత బాగా నటించలేరని చాలామంది నమ్ముతూ ఉంటారు.
ముఖ్యంగా సీరియల్స్ లో నటించే వాళ్లకి ప్రాంటింగ్ ద్వారా డైలాగులను చెబుతూ ఉంటారు. దానివల్ల సీరియల్లో అయితే ఫీల్ క్యారీ అవుతుంది. కానీ సినిమాల్లో మాత్రం అలా చెప్పడం వల్ల ఫీల్ అనేది క్యారి అవ్వదు. మరి ఇలాంటి సందర్భంలో సీరియల్ నటులను పెట్టుకొని ఇబ్బంది పడే కంటే కొత్త నటులు లేదంటే ఆల్రెడీ సినిమాల్లో ఎస్టాబ్లిష్ అయిన నటులు పెట్టుకొని సినిమాలు తీయడానికే దర్శకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
అందుకే సీరియల్లో నటించిన నటినటులకు సినిమాల్లో అవకాశాలు పెద్దగా రావు. వచ్చిన కూడా వాళ్లు వాటిని పట్టించుకోవడంలో మాత్రం ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి సీరియల్ నటులను సినిమాల్లో ఎందుకు తీసుకోరు అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సినిమా దర్శకులు భారీ వ్యయంతో సినిమాలను చేస్తూ ఉంటారు. కాబట్టి సీరియల్ నటిల్ని రోజు టీవీలో ఫ్రీ గా చూస్తూ ఉంటారు. అలాంటి నటులను డబ్బులు పెట్టి సినిమాల్లో చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడరు.
దాని వల్ల కూడా వారిని సినిమాల్లో ఎక్కువగా తీసుకోలేరు. ఇక మొత్తానికైతే సీరియల్ నటులకి సినిమా నటులకి మధ్య ఉన్న తేడా ఇదే… ఇక ఇప్పుడిప్పుడే కొంతమంది సీరియల్ నటులు సినిమా నటులుగా రాణిస్తున్నప్పటికీ లాంగ్ కెరియర్ లో మాత్రం వాళ్ళు నిలబడలేక పోతున్నారు…