https://oktelugu.com/

Bobby Deol: ఒక్క సినిమాతో ఆ విలన్ ఫేట్ మారిపోయింది.. ఇప్పుడు అందరూ క్యూ కడుతున్నారు.. ఇంటస్ట్రింగ్ స్టోరీ

యానిమల్‌ సినిమాలో అబ్రార్‌ సాంగ్‌ ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్‌కి ఓ పాట... ఆ పాట వైరల్‌ కావడం అంటే మామూలు విషయం కాదు. రీసెంట్‌ టైమ్స్ లో అందరినీ ఆకట్టుకున్న విషయం కూడా ఇదే. యానిమల్‌ విలన్‌కి అంతగా పేరు రాబట్టే, ఇప్పుడు సౌత్‌లో ఏ స్టార్‌ హీరో సినిమా చేసినాసరే విలన్ గా ఈయనను కావాలి అనుకుంటున్నారట.

Written By:
  • Gopi
  • , Updated On : September 18, 2024 / 01:08 PM IST

    Bobby Deol

    Follow us on

    Bobby Deol: ఒక్కసారి మంచి క్యారెక్టర్ వచ్చి వైరల్ గా మారితే చాలు సినిమా ఇండస్ట్రీలో లైఫ్ సెటిల్ అయినట్టే. అదృష్టం, నటన, అంకిత భావం ఉంటే ఇక ఆర్టిస్టులకు సాటి ఎవరూ ఉండరు. అందుకే ఒక్క క్యారెక్టర్ సూపర్ గా జనాలకు నచ్చే విధంగా ఉండాలి. ఆ తర్వాత ఫుల్ ఛాన్స్ లు వస్తాయి. కానీ ఆ తర్వాత కూడా అదే విధంగా పర్ఫామెన్స్ ఉండాలి. అలా ఉంటే మాత్రమే నెగ్గుతారు. ఒక సినిమాకు మించి మరొక సినిమా ఉండాలి. నటనను ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి. కొత్త వారికి కాంపిటీషన్ గా ఉండాలి. పాత చింతకాయ పచ్చడి మాదిరి ఉండకూడదు. ఇలాంటి లక్షణాలు ఉంటే ఇక వారికి అడ్డే ఉండదు. మొత్తం మీద పర్ఫెక్ట్ కేరక్టర్‌ ఒకటి పడితే చాలు అన్నమాట. సరిహద్దులు దాటుకుని చాన్సులు తలుపులు కొట్టేస్తుంటాయి. ఇప్పుడు బాబీ డియోల్‌ని ముంచెత్తుతున్న అవకాశాలు చూసిన వారందరూ అదే నిజం అనుకుంటున్నారు. విజయ్‌ సినిమాలో బాబీ డియోల్‌ నటిస్తారని టాక్.

    యానిమల్‌ సినిమాలో అబ్రార్‌ సాంగ్‌ ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్‌కి ఓ పాట… ఆ పాట వైరల్‌ కావడం అంటే మామూలు విషయం కాదు. రీసెంట్‌ టైమ్స్ లో అందరినీ ఆకట్టుకున్న విషయం కూడా ఇదే. యానిమల్‌ విలన్‌కి అంతగా పేరు రాబట్టే, ఇప్పుడు సౌత్‌లో ఏ స్టార్‌ హీరో సినిమా చేసినాసరే విలన్ గా ఈయనను కావాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న కంగువలోనూ కూడా విలన్ పాత్రలో ఈయనే రాబోతున్నారు. సూపర్‌స్టార్‌ మీదున్న గౌరవంతో కంగువ సైడ్‌ ఇచ్చింది. అంటే ఈ సినిమా రిలీజ్‌ పోస్ట్ పోన్‌ అయింది. లేకపోతే అక్టోబర్‌ 10న థియేటర్లలో మరోసారి బాబీ డియోల్ పెర్ఫార్మెన్సును అదిరిపోయేది అంటున్నారు బాబీ అభిమానులు.

    హరిహరవీరమల్లు ఆన్‌ టైమ్‌ వచ్చినా కూడా బాబీ డియోల్‌కి సౌత్‌లో ఇంకో ప్రాజెక్ట్ ఎప్పుడో వచ్చేది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లులో విలన్‌గా కూడా ఈ విలన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బాలయ్య 109 కోసం బాబీ డియోల్‌తో కలిసి చేయబోతున్నారు. ఇక ఈ విషయాన్నిఆ మధ్య ఊర్వశి రౌతేలా పెట్టిన పిక్స్ ద్వారా తెలిసింది. అంటే ఎన్బీకే 109లో సంక్రాంతికి బాబీ డియోల్‌ని చూడొచ్చు అంటున్నారు నెటిజన్లు.. ఆ వెంటనే దళపతి 69లోనూ విలన్‌గా బాబీ డియోల్ పేరు వినిపించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సో.. 2025లో వరుసగా బాబీ సౌత్‌ హీరోలతో పోటాపోటీగా స్క్రీన్స్ పై సందడ చేయనున్నారు అన్నమాట.

    బాలయ్య, బాబీ డైరెక్షన్ లో( Director Bobby ) ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో విలన్ గా బాబీ డియోల్( Bobby Deol ) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యారు.. అయితే వీళ్ళ మధ్య ఒక భారీ ఫైట్ ఉండబోతుందట. దీనికి సంబంధించిన షూట్ ని కూడా తొందర్లోనే ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్.రామోజీ ఫిలిం సిటీ లో ఈ ఫైట్ సీక్వెన్స్ సంబంధించిన సెట్ వర్క్ కూడా జరుగుతుందని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన భారీ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ సిద్ధం అయింది.