Prabhas Fauji Movie Look: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నుండి ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్న చిత్రం ‘ఫౌజీ'(Fauji Movie). అభిమానులు, ప్రేక్షకులు ఎక్కువగా ‘స్పిరిట్’ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ, అంతకంటే ముందే ‘ఫౌజీ’ ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే టాక్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది, ఇప్పుడు సినిమాలోని యుద్దపు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వంద రోజుల పాటు ఈ షూటింగ్ సాగనుంది. ప్రభాస్ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఈ షూటింగ్ ని పూర్తి చెయ్యడానికే కేటాయించాడు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి చూస్తున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా లోని ప్రభాస్ లుక్, ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ప్రభాస్ హెయిర్ స్టైల్ అభిమానులకు కాస్త డిఫరెంట్ గా అనిపించింది.
ఇక ఇతర హీరోల అభిమానులు అయితే ఒక రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఈ లుక్ సోషల్ మీడియా లోకి ఎలా వచ్చిందంటే, రీసెంట్ గానే సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లు గా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ గానే ప్రభాస్ కూడా ఈ చిత్రాన్ని చూసి మేకర్స్ కి శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాకుండా మేకర్స్ తమ సినిమాకు రీచ్ పెరగడం కోసం ప్రభాస్ ని ఇంటర్వ్యూ ఇవ్వమని రిక్వెస్ట్ చేయగా, ప్రభాస్ అందుకు ఊపుకొని ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ లో ఉన్నాడు కాబట్టి. ప్యాకప్ సమయం లో ఆయన ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందుకే ‘ఫౌజీ’ లుక్ లో కనిపించాడు ప్రభాస్. ఇకపోతే ఈ సినిమా హీరో సంతోష్ శోభన్ ప్రభాస్ కి అత్యంత సన్నిహితుడు.
తన కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘వర్షం’ చిత్రాన్ని తెరకెక్కించింది సంతోష్ శోభన్ తండ్రి ‘శోభన్’. అప్పటి నుండి ప్రభాస్ వీళ్ళ కుటుంబం లో ఒక సభ్యుడిగా మారిపోయాడు. సంతోష్ శోభన్ ప్రతీ సినిమాని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటాడు ప్రభాస్. ఈసారి ఆయన కోసం ఏకంగా ఇంటర్వ్యూ నే ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో నిన్న విడుదలైంది. నేడు పూర్తి ఇంటర్వ్యూ విడుదల కాబోతుంది. చూడాలి మరి ఈ ఇంటర్వ్యూ లో ప్రభాస్ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి అనేది. సోషల్ మీడియా లో బాగా వైరల్ ప్రోమో ని మీరు కూడా చూసేయండి. ప్రభాస్ లుక్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్స్ లో తెలియజేయండి.
