Sukumar: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్…ఈయన ఇప్పటి వరకు తనదైన రీతిలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ప్రేక్షకుడి యొక్క ఐక్యూ లెవల్ ను టెస్ట్ చేస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు. ప్రతి సీన్ లో ఏదో ఒక డీటెయిల్ ని రాసుకుంటూ దానిని ప్రేక్షకుడు కనుక్కుంటాడా? లేదా అనే ఒక పజిల్ ని వదులుతూ ఉంటాడు. మరి ఇలాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ చేసే సినిమాలను అర్థం చేసుకోవాలంటే ప్రేక్షకుడు ఆ సినిమాని చాలా ఇంటెన్స్ తో చూడాల్సిన అవసరమైతే ఉంది. మరి అలాంటి క్యాలిక్యులేషన్స్ తో సినిమాలను చేయగలిగే సత్తా ఉన్న దర్శకుడు సుకుమార్ కావడం విశేషం… ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక కొత్త అంశాన్ని అయితే ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తూనే వస్తున్నాయి. ప్రస్తుతం అయిన పుష్ప 2 సినిమా చేశాడు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో విపరీతమైన ప్రమోషన్స్ చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే సుకుమార్ ప్రతి సినిమాలో చంద్రబోస్ సాంగ్స్ రాస్తూ ఉంటాడు. దానికి గల కారణం ఏంటి అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. నిజానికి సుకుమార్ కి చంద్రబోస్ పాటలు అంటే చాలా ఇష్టమట. తను డైరెక్టర్ అవ్వకముందు నుంచి చంద్రబోస్ పాటలను వింటూ ఉండేవారట. అందులోని లిరిక్స్ ఆయనకు చాలా ఇష్టమని కూడా చెప్పారు.
ఇక అందుకోసమే తన ప్రతి సినిమాలో చంద్రబోస్ గారితో పాటలను రాయించుకొని ఆయన రాసిన లిరిక్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడట. ఇక మొత్తానికైతే సుకుమార్ చంద్రబోస్ కి వీరాభిమాని అని చెప్పకనే చెప్పాడు. ఇక ఒకానొక సందర్భంలో స్టేజ్ మీద సుకుమార్ చంద్రబోస్ గారి కాళ్ళు కూడా మొక్కాడు. ఇక సీన్ అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది.
ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో పాటలు రాయాల్సి వచ్చినప్పుడు చంద్రబోస్ కూడా చాలా జాగ్రత్తగా పాటలను రాస్తానని సుకుమార్ తన మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా ఇప్పటివరకు ముందుకు సాగుతున్నానని చెప్పడం విశేషం…