Amaran OTT: తమిళ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అమరన్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై అటు తమిళంలోనూ, ఇటు తెలుగు లోనూ సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపుగా 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ ఏడాది టాప్ 5 గ్రాసర్స్ లో ఒకటిగా నిల్చింది ఈ చిత్రం. ఈ సినిమాకి ప్రముఖ హీరో కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ‘విక్రమ్’ తర్వాత కమల్ హాసన్ కి నిర్మాతగా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా అమరన్ నిల్చింది. ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 5వ తారీఖున ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రామింగ్ కాబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో నిర్మాతలు చేయనున్నారు. అయితే ఈ సినిమాలో ఎడిటింగ్ లో భాగంగా తొలగించిన కొన్ని సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ లో జత చేయబోతున్నారట. ఈ సన్నివేశాలు అద్భుతంగా వచ్చినప్పటికీ, మూవీ రన్ టైం భారీగా ఉండడంతో తొలగించాల్సిన పరిస్థితి వచ్చిందట. ఓటీటీ లో ఈమధ్య ఈ ట్రెండ్ నడుస్తుండడంతో మేకర్స్ కూడా ఈ సినిమాలోని తొలగించిన సన్నివేశాలను జత చేస్తూ 5వ తారీఖున స్ట్రీమింగ్ చేయబోతున్నారట. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని అదే స్థాయిలో మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి. చాలా సినిమాలు థియేటర్స్ లో సూపర్ హిట్ అయ్యినవి, ఓటీటీ లో మాత్రం మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఈ చిత్రం ఆ కోవకి చెందుతుందా?, లేకపోతే ఓటీటీ లో కూడా హిట్ అవుతుందా అనేది చూడాలి.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి ఇప్పటికీ కూడా డైలీ గ్రాస్ వసూళ్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో నిన్న కూడా ఈ చిత్రానికి 20 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. ఇటీవల కాలంలో మన స్టార్ హీరోలకు కూడా ఈ స్థాయి లాంగ్ రన్ రాలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా 29 రోజులకు గానూ ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కేవలం 5 కోట్ల రూపాయిలు మాత్రమే. కానీ బయ్యర్స్ కి వచ్చిన లాభాలు 5 రెట్లు. ఓటీటీ లోకి విడుదల అయిన తర్వాత కూడా ఈ సినిమాకి గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.