Hero Raja: తెలుగు సినిమా పరిశ్రమలో బ్యాక్ బోన్ లేకపోతే బతకడం కష్టం. ఎదగడం ఇంకా అనుమానాస్పదమే. స్వయంకృషితో ఎదిగిన వారున్నా ఎలాంటి అండదండలు లేకపోతే పరిశ్రమలో రాణించడం అంత సులువైన విషయం కాదు. సీనియర్ నటుడు కాంతారావు కుమారుడు రాజా కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పడరాని పాట్లు పడ్డాడు. కానీ చివరకు సినిమాలనే వదిలేయాల్సి వచ్చింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ కెరీర్ మంచి పొజిషన్ లో ఉండగానే రాజా పరిశ్రమ నుంచి నిష్క్రమించాడు. తనకు అచ్చిరాని సినిమాపై ఎలాంటి అభిమానం చూపించకుండా నిర్దాక్షిణ్యంగా తప్పుకున్నాడు.
పరిశ్రమలో ఎన్నో కష్టాలు. మరెన్నో తిప్పలు. అన్నింటిని భరించినా చివరకు తన మనసు మాత్రం సినిమా వద్దనే చెప్పడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాను. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాను. ఒక పాస్టర్ గా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో రాజా తన మనోగతం విప్పాడు. ఇండస్ట్రీలో రాణించాలంటే గాడ్ ఫాదర్ ఉండాలని చెప్పాడు. దీంతోనే తనకు ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని వాపోయాడు. నమ్ముకున్న వారే నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి చిరిగిన చొక్కాతోనే తాళి ఎందుకు కట్టాల్సి వచ్చింది?
ఓసారి తన కారు డ్రైవర్ కు అవసరం ఉందంటే రూ. 7 లక్షలు ఇస్తే తెల్లవారే తనకు కనిపించకుండా పోయాడని బాధ పడ్డాడు. అలాంటి సంఘటనలెన్నో తనను ఈ దారికి తీసుకొచ్చాయన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ లో చేరి సేవలు చేసినా తరువాత కాలంలో ఆయన మరణించాక రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నాను. చివరకు పాస్టర్ గా ప్రస్థానం మొదలెట్టాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. జీవితం సాఫీగా సాగుతోంది. ఎలాంటి బాధలు లేవు. ఎలాంటి టెన్షన్ లు రావు. పవిత్రంగా వృత్తిని చేసుకుంటూ బతుకుతున్నానని తెలిపారు.
రాజా జీవితంలో జరిగిన సంఘటనలతోనే అతడికి జీవితంపై విరక్తి వచ్చింది. దీంతోనే సినిమాలకు దూరమై కొద్ది రోజులు రాజకీయాల్లో ఉన్నా వైఎస్ చనిపోయాక అక్కడ నుంచి కూడా వచ్చేసి ప్రశాంతమైన జీవితం గడిపేందుకు క్రైస్తవ మతం స్వీకరించాడు. పాస్టర్ గా ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాడు. తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల వల్లే తనకు వైరాగ్యం వచ్చేసిందని చెప్పుకున్నాడు. అందుకే ఎవరిని కూడా అంత తేలిగ్గా నమ్మి మోసపోవద్దని చెబుతున్నాడు.
Also Read:Top Heroines Mistakes: టాప్ హీరోయిన్లు చేసే అతిపెద్ద పొరపాటు ఏది?