Megastar Chiranjeevi: తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయాలు, బంధుత్వాలతోనే ఎదిగిన వారున్నారు. కానీ ఎలాంటి పరిచయాలు లేకుండా ఎవరి సహాయం అక్కర్లేకుండా ఎదిగిన ఒకే ఒక్క హీరో చిరంజీవి. స్వయంకృషిని నమ్ముకుని తనదైన శైలిలో నటనలో వైవిధ్యం ప్రదర్శిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన కథానాయకుడు చిరంజీవి. మొదట్లో అందరూ హేళనగా మాట్లాడిన వారే. ఖైదీ తరువాత కూడా ఫెయిల్యూర్లు వచ్చినా లెక్క చేయలేదు. భవిష్యత్ నే నమ్ముకున్న చిరుకు సినిమా పరిశ్రమ సలాం కొట్టింది. అతడి ధైర్యానికి అందలం వేసింది. అగ్రహీరోగా నిలబెట్టింది. పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు మెగాస్టార్ గా మారారు. ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా నటనలో వెరైటీ ప్రదర్శిస్తూ తానేమిటో నిరూపించుకుని ఇంతటి స్థాయికి ఎదిగిన చిరంజీవి ఎన్నో కష్టాలు పడ్డాడు.

చిరంజీవిలోని ప్రతిభను చూసి అల్లురామలింగయ్య తన కూతురును ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కొడుకు అల్లు అరవింద్ తో చెప్పగానే తాను మాట్లాడతానని చెప్పాడు. దీంతో అరవింద్ వెళ్లి చిరంజీవిని కలిసి మా చెల్లెలిని మీకు ఇవ్వాలని అనుకుంటున్నామన చెప్పగానే మొదట చిరంజీవి తడబడ్డాడట. కానీ ఈ ఆఫర్ ను కాదనలేక ఒప్పుకున్నాడట. చిరంజీవి రూం అల్లు రామలింగయ్య ఇంటికి దగ్గర్లోనే ఉండేదట. బంగ్లా మీద నుంచి చూసి సురేఖ చిరంజీవి అంత స్టైల్ గా లేడని అంటే అల్లు రామలింగయ్య మాత్రం అతడిలో మంచి నటుడు ఉన్నాడని ఒప్పించాడట.
Also Read: Top Heroines Mistakes: టాప్ హీరోయిన్లు చేసే అతిపెద్ద పొరపాటు ఏది?
అలా వారి పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. ఇక్కడ కూడా చిక్కు వచ్చి పడింది. చిరంజీవికి పెళ్లి రోజు కూడా షూటింగ్ ఉంది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అల్లు అరవింద్ చిరంజీవి టెన్షన్ ను అర్థం చేసుకుని షూటింగ్ కు దగ్గరలోనే పెళ్లి ఏర్పాటు చేశాడట. దీంతో చిరు షూటింగ్ నుంచి నేరుగా పెళ్లి మంటపానికి వచ్చి తాళి కట్టాడు. షూటింగ్ సమయంలో చొక్కా కాస్త చిరగడంతో అదే చొక్కాతో చిరు తాళి కడుతుంటే చూసేవారందరు చిరిగిన చొక్కాతో తాళి కడతావా అంటే చొక్కా చిరిగితే ఏమి తాళి కట్టలేనా అని సెటైర్ వేశాడట. అప్పుడు అందరు నవ్వుకున్నారు.

చిరంజీవిలో ఉన్న టాలెంట్ ను గుర్తించింది మాత్రం అల్లు రామలింగయ్య. అతడు ఎప్పటికైనా పెద్ద హీరో అవుతాడని చెప్పారు. పదేళ్లలోనే స్టార్ హీరోగా ఎదిగి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఒక్కోసారి మన ప్రతిభను మనం గుర్తించలేం. కానీ పక్కనున్న వారు కచ్చితంగా గుర్తించి మనకు సూచనలు చేస్తారు. వాటిని మనం స్వీకరించి నడుచుకుంటే భవిష్యత్ బంగారమే. లేదంటే గతి తప్పిన వారమవుతాం. అలా మెగాస్టార్ ప్రస్థానం ఓ రకంగా అల్లు రామలింగయ్య చొరవతో ఆయన కూతురుని పెళ్లి చేసుకుని తిరుగులేని స్టార్ గా ఎదగడం గమనార్హం.
Also Read:Superstar Krishna: నరేష్ నాల్గవ పెళ్లి పై విరుచుకుపడిన సూపర్ స్టార్ కృష్ణ
Recommended Videos



[…] Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి చిరిగిన చొక్కాతోనే … […]
[…] Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి చిరిగిన చొక్కాతోనే … […]