Wife Cheats Husband in Guntoor: ఇటీవల కాలంలో మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎదుటి వారిని బుట్టలో వేసుకునేందుకు ఎన్నో దారులు వెతుకుతున్నారు. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా మోసపోతే మరికొందరు మాత్రం డైరెక్టుగానే మోసాలకు బలవుతున్నారు. జీవితంలో పెళ్లి అనేది అందరికి ఓ కల. అలాంటి పెళ్లిని కూడా తమ ఇష్టానుసారంగా మార్చుకుంటూ ఎదుటి వారిని కట్టిపడేస్తున్నారు. మత్తెక్కించే అందంతో మైరపింపచేసి మగాడిలో లేని కోరికలు రగిలించి చివరకు ఉడాయిస్తున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల చిత్తూరు జిల్లా పుత్తూరులో ఓ 54 ఏళ్ల మహిళ 30 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకుని చివరకు అడ్డంగా దొరికిపోయింది.

గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస రావు ఇంజినీరింగ్ పూర్తి చేసి మోటో కంట్రోలర్ మెకానిక్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరకు ఓ సంబంధం చూశాడు. దీంతో అమ్మాయి అందంగా ఉండటంతో తనకు బాగా నచ్చిందని పెళ్లికి ఓకే అని చెప్పేశాడు. కానీ అమ్మాయికి ఏం లేదని చెప్పడంతో రూ.2 లక్షల విలువ చేసే బంగారం అమ్మాయికి అందజేశాడు. పెళ్లి జరిగింది. ఇక విందు తన ఇంట్లో వైభవంగా నిర్వహించుకున్నాడు. దాదాపు రూ. 6 లక్షలు ఖర్చు చేశారు.
Also Read: Pawan Kalyan Janavani : జనం ఘోష Vs జగన్ ఘోష
వివాహం జరిగినప్పటి నుంచి భార్య శ్రీనివాస్ ను దూరం పెట్టింది. ఏవో సాకులు చెబుతూ అతడితో సంసారం మాత్రం చేయలేదు. రోజూ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కు సంసార సుఖం మాత్రం దక్కలేదు. అయితే ఇటీవల తన పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన భార్య ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా ఆమెకు ఇదివరకే పెళ్లయిందని తెలిసింది. దీంతో షాక్ కు గురయ్యాడు. పెళ్లయిన దానికే తాను తాళి కట్టానా అని నిట్టూరుస్తున్నాడు.

జరిగిన విషయం పోలీసులకు తెలిపి కేసు పెట్టాడు. కానీ డబ్బు, బంగారంతో ఉడాయించిన ఆమె ఇక ఎక్కడ దొరుకుతుంది. మగాళ్లను మాయమాటలతో బురిడీ కొట్టించి పెళ్లిపేరుతో మోసం చేసే ఆడవాళ్లు ఎంతకైనా తెగిస్తారు. ఎన్నో ఊహలతో పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ కు చేదు అనుభవమే ఎదురైంది. చేయని తప్పుకు బాధ్యత వహించాల్సి రావడం విడ్డూరమే. అతడు అనవసరంగా ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుని మోసపోయాడు. సో ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఎవరో చూసిన సంబంధాలు కాకుండా దగ్గర వాళ్లయితేనే అన్ని చూసుకుని వివాహం చేసుకోండి. మోసాలకు గురికాకండని పోలీసులు సూచనలు చేస్తున్నారు.
Also Read:Janasena Digital War: గుడ్ మార్నింగ్ సీఎం సార్.. జనసేన ‘డిజిటల్ వార్’