https://oktelugu.com/

Rajamouli – Allu Aravind : రాజమౌళి కి అల్లు అరవింద్ కి మధ్య ఉన్న గొడవ ఏంటి..?

ఇక అరవింద్ అలా చేయపోవడానికి దాని వెనుక కారణం ఏంటి అనేదాని మీద కూడా చాలా రకాల ప్రశ్నలు తలెత్తాయి.

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2023 10:48 pm
    Follow us on

    Rajamouli – Allu Aravind : ఒక డైరెక్టర్ కి టాలెంట్ ఉంటే అతను ఎంత పెద్ద డైరెక్టర్ గా అయిన ఎదగవచ్చు అని రాజమౌళిని చూస్తే మనకు అర్థం అవుతుంది.ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లో గుర్తింపు కోసం వరల్డ్ స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఆకాశమే హద్దుగా సినిమాలని చేస్తూ ఆయన ముందుకు కదులుతున్నాడు.

    ఇక ఇదే క్రమంలో ఇంతకుముందు రాజమౌళి రామ్ చరణ్ తో చేసిన మగధీర అనే సినిమా తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అప్పటివరకు తెలుగు లో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది.ఇక ఇలాంటి క్రమంలో ఆ సినిమాని అప్పుడే రాజమౌళి పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేద్దామని అల్లు అరవింద్ ను అడిగినప్పటికి ఆయన మాత్రం దానికి ఇష్టపడలేదు. ఒక్క తెలుగులోనే ఈ సినిమా ని రిలీజ్ చేద్దామని తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు.దాంతో అల్లు అరవింద్ కి రాజమౌళి కి మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి…ఇక అప్పటి నుంచి అల్లు అరవింద్ మీద కోపంతో రాజమౌళి ఉన్నట్టు గా కూడా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. నిజానికి మగధీర సినిమాలో స్టోరీ మాత్రం చాలా డెప్త్ గా ఉంటుంది. కాబట్టి ఆ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తే తెలుగు సినిమా ఎప్పుడో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయేది కానీ అల్లు అరవింద్ మాత్రం అలా చేయలేదు.

    ఇక అరవింద్ అలా చేయపోవడానికి దాని వెనుక కారణం ఏంటి అనేదాని మీద కూడా చాలా రకాల ప్రశ్నలు తలెత్తాయి.అందులో బాగా వినిపించింది ఏంటంటే అల్లు అరవింద్ కొడుకు అయిన అల్లు అర్జున్ తెలుగు సినిమాకి మాత్రమే పరిమితం అయితే తన అల్లుడైన రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోవడం అతనికి నచ్చక ఆ కారణం చేతనే ఆ సినిమాని తెలుగులో మాత్రమే రిలీజ్ చేశాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆయన ఏ ఉద్దేశ్యంతో వద్దన్నాడో కానీ ఆ సినిమా మాత్రం ఒక తెలుగులోనే రిలీజ్ అయింది తెలుగులో ఇండస్ట్రీ హిట్టు కొట్టి అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని బ్రేక్ చేసింది.ఇక ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోలుగా ఎదిగారు…