https://oktelugu.com/

KGF 3: కేజీఎఫ్-3 పై డైరెక్టర్ ఆలోచన ఏంటీ?

KGF 3 Movie: కోలార్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్’. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. హీరో యశ్ రాఖీ నుంచి రాఖీ భాయ్ గా ఎలా మారడనేది కేజీఎఫ్ తొలి పార్ట్ లో దర్శకుడు చాలా చక్కగా చూపించారు. కేజీఎఫ్ కు సిక్వెల్ గా కేజీఎఫ్ చాప్టర్ 2 వచ్చింది. కోలార్ మైన్స్ ను కాపాకునేందుకు రాఖీఖాయ్ ఎలాంటి వ్యూహాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2022 / 01:54 PM IST
    Follow us on

    KGF 3 Movie: కోలార్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్’. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. హీరో యశ్ రాఖీ నుంచి రాఖీ భాయ్ గా ఎలా మారడనేది కేజీఎఫ్ తొలి పార్ట్ లో దర్శకుడు చాలా చక్కగా చూపించారు.

    కేజీఎఫ్ కు సిక్వెల్ గా కేజీఎఫ్ చాప్టర్ 2 వచ్చింది. కోలార్ మైన్స్ ను కాపాకునేందుకు రాఖీఖాయ్ ఎలాంటి వ్యూహాలు రచించాడు? ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొన్నాడనే నేపథ్యంలో చాప్టర్ 2 సినిమా వచ్చింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ‘కేజీఎఫ్’ నుంచి మరో పార్ట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

    కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ చివర్లో రాఖీఖాయ్ బంగారంతో సహా సముద్రంలోకి దూకుతాడు. దీనిని బేస్ చేసుకొని దర్శకుడు మరో సినిమాకు లింకు చేస్తాడనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ విషయంపై అభిమానులు పెద్దఎత్తున చర్చించుకుంటున్నారు.

    కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కలిసి ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కథ కూడా మైన్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. దీంతో కేజీఎఫ్ కథను దర్శకుడు ‘సలార్’ కు లింకు చేస్తాడా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీంతో యాక్షన్ హీరోలందరినీ కలిపి ప్రశాంత్ నీల్ ఓ డెన్ ఏర్పాటు చేయబోతున్నారనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.

    కేజీఎఫ్ 3 పై వస్తున్న వార్తలపై దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తనకు ఓ కల ఉందని.. అయితే అది నెరవేరిన తర్వాతే ఆ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. దీంతో కేజీఎఫ్ మూవీకి అంతం లేదని అర్థమవుతోంది. టైమ్ లైన్ బేస్ చేసుకొని ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కథను అల్లుకుంటూ పోయే అవకాశం ఉంది.

    ఇదిలా ఉంటే కేజీఎఫ్ 2 సక్సస్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాప్ దర్శకుడిగా మారాడు. ఆయనతో కలిసి పని చేసేందుకు టాప్ హీరోలంతా ఉత్సాహం చూపుతున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి ‘సలార్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ లతో  ప్రశాంత్ నీల్ సినిమాలు చేసే అవకాశం ఉంది.

    Recommended Videos:

    Tags