Ram Charan And NTR: రామ్ చరణ్ కి ఎన్టీయార్ కి మధ్య ఉన్న తేడా ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్లను వాళ్లు స్టార్ హీరోలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొందరు మాత్రం స్టార్ స్టేటస్ ని అనుభవిస్తూనే నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఇక అందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లో ముందు వరుసలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు పోటీ పడుతూ ఎవరు నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకుంటారనే విషయంలో చాలా వరకు కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Written By: Gopi, Updated On : October 27, 2024 11:48 am

NTR And Ram Charan

Follow us on

Ram Charan And NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి చాలా సంవత్సరాల నుంచి భారీ గుర్తింపు అయితే ఉంది. ఇక రెండు ఫ్యామిలీలు సినిమా ఇండస్ట్రీలో తమదైన ముద్రను వేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇక ఈ తరంలో ఈ రెండు ఫ్యామిలీలను ముందుకు తీసుకెళ్లడానికి నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ముందు వరుసలో దూసుకుపోతున్నారు. ఇక వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా ప్రేక్షకులందరి ని మెప్పించడమే కాకుండా వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ను కూడా ప్రేక్షకులకు తెలిసేలా చేసింది. మొత్తానికైతే వీళ్ళిద్దరూ కలిసి చేసిన త్రిబుల్ ఆర్ సినిమా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది. ఇక ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో ఒక విపరీతమైన బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. మొత్తానికైతే వాళ్ళు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు మంచి నటులు అలాగే మంచి డాన్సర్లు అనే విషయం మనకు తెలిసిందే. అయితే రామ్ చరణ్ కి జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ఒక విషయంలో తేడా అయితే ఉంది. అది ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ అందరితో కలివిడిగా ఉంటూ చాలా ఫాస్ట్ గా ఫ్రీగా మాట్లాడుతుంటాడు. రామ్ చరణ్ మాత్రం మాట్లాడేటప్పుడు కొంతవరకు ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి ఆయనకి మొహమాటం అయితే ఉంటుంది.

అది ఆయన మాట్లాడే మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మొత్తానికైతే వీళ్లిద్దరూ చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ లను సాధిస్తున్నాయి. అలాగే వాళ్ళ ఫ్యాన్స్ ని కూడా ఉత్సాహపరుస్తూ ఉంటాయి.

ఇక రామ్ చరణ్ కొంతవరకు మొహమాట పడడం అనేది ఆయనకు పెద్దల పట్ల ఉన్న గౌరవం వల్ల గాని, ఏదైనా పర్టిక్యూలర్ సిచువేషన్ లో తను మాట్లాడేటప్పుడు ఆయన కొంతవరకు మొహమాటపడుతూ ఉంటాడు అంటూ సినీ మేధావులు కూడా అప్పుడప్పుడు ఈ విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు…

ఇక అంతే తప్ప ఎన్టీఆర్ కి, రామ్ చరణ్ కి మధ్య సినిమాలపరంగా గాని, నటన పరంగా గాని, డ్యాన్స్ పరంగా గాని ఎలాంటి భేదాలు లేవు. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడేంత టాలెంట్ ఉన్న నటులు కావడం విశేషం…