https://oktelugu.com/

Pawan Kalyan OG: ఓజీ లో పవన్ కళ్యాణ్ గెటప్ చేంజ్ చేస్తున్న సుజీత్…కొద్దిసేపు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ రావాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక దర్శకుల విషయంలో అయితే ఇది చాలా ఎక్కువగా ఉంది. వాళ్లకు నచ్చిన సినిమాలని నచ్చిన హీరోలతో చేస్తూ సూపర్ సక్సెస్ ని అందుకోవడానికి ఎప్పుడు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే సుజీత్ లాంటి యంగ్ డైరెక్టర్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 27, 2024 / 11:46 AM IST

    Pawan Kalyan OG

    Follow us on

    Pawan Kalyan OG: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఇక యంగ్ డైరెక్టర్లు అయితే వచ్చిన కొత్తలోనే పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగడమే కాకుండా తమను తాము స్టార్ డైరక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సుజీత్ లాంటి దర్శకుడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఆయన బర్త్ డే సందర్భంగా ఓజీ సినిమా నుంచి ఆయనకు సంబంధించిన ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇక మొత్తానికి ఓ జి సినిమాని చాలా ఉత్తమంగా దర్శకుడు సుజీత్ తీర్చి దిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సుజీత్ సాహో సినిమాతో ప్రభాస్ కి ఒక మంచి సినిమాను అందించిన ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా అదే రీతిలో భారీ సక్సెస్ ని అందించాలనే ఉద్దేశ్యం తో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను చాలా వరకు కంప్లీట్ చేసిన సుజీత్ ఇక బ్యాలెన్స్ షూట్ ను కూడా తొందర్లోనే ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇదిలా ఉంటే ఓజి సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక మాఫియా డాన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. దాంతోపాటుగా ఈ సినిమాలో ఆయన కొద్దిసేపు పొలిటిషన్ పాత్రను కూడా పోషించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఆ పాత్రలో కూడా ఆయన చాలా డిఫరెంట్ గా నటించి మెప్పించబోతున్నారట.

    మరి ఆయన పొలిటిషన్ గా ఎందుకు నటించాల్సి వచ్చింది అనేది తెలియాలంటే మాత్రం థియేటర్లోనే చూసి తెలుసుకోవాల్సిందే అంటూ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సుజీత్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

    ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీని ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉండడం వల్ల సినిమా డిలే అవుతూ వస్తుంది…