https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి కి బ్యాడ్ నేమ్ తెచ్చిన సంఘటనలు ఇవే…వీటి వెనక ఎవరి హస్తం ఉంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ సినిమాలను చేస్తూ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆయనను మించిన నటులు మరొకరు లేరు అనేంతల గుర్తింపును పొందడమే కాకుండా యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు... ఇక ఇదిలా ఉంటే ఆయన చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు... మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 27, 2024 / 11:50 AM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 40 సంవత్సరాలు నుంచి ఆయన ఇండస్ట్రీలో ఏకఛత్రాధిపత్యంతో ఎలుతున్న ఒకే ఒక్క స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనదైన రీతిలో గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆయనకు బ్యాడ్ నేమ్ ని తీసుకొచ్చిన సంఘటనలు కూడా తన నిజ జీవితంలో చాలానే జరిగాయనే విషయం మనలో చాలామందికి తెలియదు. అవి ఏంటి అంటే మొదటగా ఉదయ్ కిరణ్ ని తన అల్లుడుగా చేసుకుంటానని ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇక దాంతో ఉదయ్ కిరణ్ కి సినిమా ఇండస్ట్రీలో కెరియర్ లేకుండా చేశారు అనే అపవాదైతే చిరంజీవి మీద ఉంది. నిజానికి చిరంజీవి అలా చేశాడా? లేదా అనే విషయాలను పక్కన పెడితే ఇలాంటిరూమర్స్ ఎందుకు అతని మీద స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ చాలా సంవత్సరాల నుంచి చాలామంది చిరంజీవి అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    నిజానికి ఉదయ్ కిరణ్ కెరియర్ ను చిరంజీవి తొక్కేయలేదని చాలాసార్లు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఉదయ్ కిరణ్ వాళ్ళ అక్క కూడా ఈ విషయం మీద చాలా సార్లు మాట్లాడింది. అయినప్పటికీ ఎవరూ నమ్మడం లేదు. ఇంకా ఉదయ్ కిరణ్ ను సినిమాల నుంచి ఎందుకు తప్పించారు అంటే చిరంజీవి కూతుర్ ను ఉదయ్ కిరణ్ చేసుకోవడం లేదు.

    కాబట్టి అతనికి మార్కెట్ అయితే ఉండదు అతని సినిమాలను మెగా ఫాన్స్ బ్యాక్ కట్ చేస్తారనే ఉద్దేశ్యంతో ఆయా దర్శక నిర్మాతలు అతన్ని సినిమా నుంచి తప్పించారు. అంతే తప్ప చిరంజీవి నుంచి ఎలాంటి ఫోర్స్ అయితే రాలేదని కొంతమంది చెబుతున్నప్పటికీ ఈ విషయంలో చిరంజీవి చాలా వరకు బ్యాడ్ గా ప్రొజెక్ట్ అయితే అయ్యాడు. ఇంకా దీని వెనుక సినీ పెద్దలు కూడా ఉన్నారనే టాక్ అయితే వినిపిస్తుంది.

    ఇక తన చిన్న కూతురు అయిన శ్రీజ విషయంలో కూడా చిరంజీవి చాలా వరకు బ్యాడ్ నేమ్ అయితే మూట గట్టుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి కెరియర్ లో ఇవి మారని మచ్చలుగా మిగిలిపోయాయి అనే చెప్పాలి…