Arundhati – Sonu sood : ‘అరుంధతి’ సినిమాకు సోనూసూద్ పారితోషికం ఎంతో తెలుసా?

ఆ రోజుల్లో ఈ సినిమాకు 20 రోజులకు రూ.18 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడట. కానీ ఇరవై రోజులకు మించితే అంటే రోజుకు రూ.25 వేలతో సినిమా పూర్తయ్యే సరికి రూ. 45 లక్షల పారితోషికం తీసుకున్నాడట.

Written By: NARESH, Updated On : June 26, 2023 7:53 pm
Follow us on

Arundhati – Sonu sood : కోడి రామకృష్ణ దర్శకత్వంలో మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై వచ్చిన సినిమా అరుంధతి  ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా నిర్మాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాటుకుని సినిమా పూర్తి చేసి విడుదల చేసిన చిత్రం యూనిట్ తరువాత వచ్చిన పేరు చూసి ఆశ్చర్యపోయింది. బాక్సాఫీసు వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. చక్కని అభిరుచితో చిత్రాలు నిర్మించే శ్యాంప్రసాద రెడ్డికి అరుంధతి ఓ అద్భుతమైన విజయం అందించింది.

మొదట చేయనని..

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా చేసిన సోనూసూద్ మొదట ఈ పాత్ర చేయనని చెప్పాడట. శ్యాంప్రసాద్ రెడ్డి ప్రోద్బలంతోనే నటించేందుకు ఒప్పుకున్నాడట. ఆపాత్ర కోసం మొదట తమిళ నటుడు పశుపతిని అనుకున్నారట. కానీ చివరకు శ్యాంప్రసాద్ రెడ్డి దృష్టి సోనూసూద్ పై పడింది. నిర్మాత ఒత్తిడి మేరకు నటించేందుకు అంగీకరించాడట. శ్యాం ప్రసాద్ రెడ్డి ఏదైనా చేయాలనుకుంటే చేసే వరకు విశ్రమించరు. అలాంటి ఆయన అరుంధతిని ఓ కలగా భావించాడు.

రూ. 45 లక్షలు

ఆ రోజుల్లో ఈ సినిమాకు 20 రోజులకు రూ.18 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడట. కానీ ఇరవై రోజులకు మించితే అంటే రోజుకు రూ.25 వేలతో సినిమా పూర్తయ్యే సరికి రూ. 45 లక్షల పారితోషికం తీసుకున్నాడట. ఇలా ఈ సినిమా నిర్మాణంలో ఎదురైన కష్టాలను అధిగమించి పూర్తి చేశారట. కానీ తరువాత వచ్చిన పేరుకు సంతోషం వ్యక్తం చేశారట.

మేకప్ కు ఆరు గంటలు

సోనూసూద్ కు మేకప్ వేయడానికి ఆరుగంటల సమయం పట్టేదట. అలా అఘోరా గెటప్ లో సోనూసూద్ అదరగొట్టాడు. సినిమాలో అతడికి వచ్చినంత పేరు ఇంకా ఎవరికి రాలేదు. దశావతారం సినిమాలకు మేకప్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి సోనూసూద్ కు మేకప్ చేయించారట. అందుకే అఘోరా గెటప్ లో అంత బాగా సూటయ్యాడు. అతడి నటనకు కూడా అందరూ ఫిదా అయ్యారు. అలా సూనూసూద్ అరుంధతి సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో జీవించాడు.