Sada : కెరీర్ బిగింగ్ నుండి హోమ్లీ రోల్స్ చేసింది సదా. ఈమె అసలు పేరు సదాఫ్. మొదట్లో అలానే పిలిచేవారు. ఆడియన్స్ సదా అనడం మొదలుపెట్టారు. జనాల్లోకి ఆ పేరు వెళ్లడంతో సదా కాస్త సదాఫ్ గా సెటిల్ అయ్యింది. 2002లో జయం మూవీతో సదా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. దర్శకుడు తేజ సదా, నితిన్ లను నటులుగా మార్చారు. వీరిద్దరి డెబ్యూ మూవీ జయం ఇండస్ట్రీని షేక్ చేసింది. యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జయం అప్పట్లో ఒక సెన్సేషన్. లంగా ఓణీలో పల్లెటూరి అమ్మాయిగా సదా కుర్రాళ్లను ఊపేసింది.
జయం మూవీ సదాను ఓవర్ నైట్ స్టార్ చేసింది. దీంతో తెలుగు, తమిళ భాషల్లో సదా బిజీ అయ్యారు. అయితే స్క్రిప్ట్ సెలక్షన్ లో అమ్మడు తడబడింది. టాప్ స్టార్స్ తో చేసిన చిత్రాలు పరాజయం పొందాయి. ఎన్టీఆర్ నాగ, బాలకృష్ణ వీరభద్ర చిత్రాల్లో సదా హీరోయిన్ గా నటించింది. అవి అంతగా ఆడలేదు. అయితే సదా కెరీర్లో అపరిచితుడు వంటి భారీ హిట్ మరొకటి ఉంది.
దర్శకుడు శంకర్ అగ్రహారానికి చెందిన బ్రాహ్మణ యువతి పాత్ర కోసం సదాను తీసుకున్నారు. విక్రమ్ హీరోగా నటించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీసు షేక్ చేసింది. సదాకు భారీ విజయం దక్కింది. అయితే ఎందుకో సదాను టాప్ స్టార్స్ కన్సిడర్ చేయలేదు. ఎక్కువగా టైర్ టూ అవకాశాలు వచ్చాయి. అలాగే ఒక దశలో వరుస పరాజయాలు ఎదుర్కొంది. 2018 తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ కి పూర్తిగా దూరమైంది. కొన్నాళ్లుగా సదా బుల్లితెర మీద సందడి చేస్తుంది.
దర్శకుడు తేజ ఆమెకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చాడు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన అహింస చిత్రంలో కీలక రోల్ చేసింది. ఈ మూవీ అంతగా ఆడలేదు. కాగా సోషల్ మీడియాలో సదా సెగలు పుట్టిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై సదా స్కిన్ షో చేసింది లేదు. కానీ ఇంస్టాగ్రామ్ వేదిక పరువాల ప్రదర్శన చేస్తుంది. తాజాగా ఎర్ర చీరలో సూపర్ హాట్ ఫోజుల్లో సదా నెటిజెన్స్ మనసులు దోచేసింది. సదా లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.