https://oktelugu.com/

Tandel movie : నాగ చైతన్య తండేల్ సినిమాలో సాయి పల్లవి పాత్ర ఏంటంటే..? ఈ సినిమా పాన్ ఇండియాలో వర్కౌట్ అవుతుందా..?

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి కథలతో సినిమాలు వస్తున్నాయి. ప్రతి ఒక్క హీరో కూడా వైవిద్య భరితమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల కంటెంట్ జన్యూన్ గా ఉండటమే కాకుండా ప్రేక్షకులకు నచ్చే విధంగా కూడా రూపొందుతున్నాయి. తద్వారా సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 24, 2024 / 10:07 PM IST

    Tandel movie

    Follow us on

    Tandel movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాగచైతన్య… అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య మొదట్లో కొన్ని సక్సెస్ లను అందుకున్నప్పటికీ ప్రస్తుతం ఆయన సక్సెస్ లను సాధించడంలో చాలా వరకు వెనుకబడి పోతున్నాడు. ఆయన సినిమాలు చేసినవి చేసినట్టుగా ఫ్లాప్ అవుతున్న క్రమంలో ఆయన అభిమానులు తన నుంచి ఒక భారీ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలనే వాళ్ళు ఎలాంటి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న తండేల్ సినిమాల మీదనే ఇప్పుడు భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు. ఇక చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఇక దానికోసమే ఆయన ఈ సినిమా మీద భారీ కసరత్తులను కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిన నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శర వేగంగా నిర్వహిస్తున్నారు.

    ఇక డిసెంబర్ 25 క్రిస్మస్ కానుక గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా అనుకున్నట్టుగా వస్తుందా? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. ఇక అలాగే చందు మొండేటి ‘కార్తికేయ 2 ‘ సినిమాతో పాన్ ఇండియాలో మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు.

    కాబట్టి ఆయన మార్కెట్ నాగచైతన్యకు భారీగా హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. మరి మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఇప్పుడు భారీ సక్సెస్ ని కొట్టి తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి పాత్ర డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో తను డ్యూయల్ రోల్ లో నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    ఒక పాత్ర చనిపోతే మరొక పాత్ర ఆ అమ్మాయి ప్లేస్ లోకి రాబోతుందనేది ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక సాయి పల్లవి ఇండియాలో ఉంటే మరొక సాయి పల్లవి పాకిస్తాన్ లో ఉంటుందట. మరి వీళ్లిద్దరి మధ్య కనెక్షన్ కూడా దర్శకుడు చాలా డిఫరెంట్ గా కలిపినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని వీటిలో ఎంతవరకు నిజం ఉందనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రాదు. చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది…