IMDB: ఐఎండిబి అంటే ఏంటి..? ఇందులో టాప్ రేటింగ్ ను సంపాదించుకున్న 5 మూవీస్ ఇవే…

ప్రస్తుతం ప్రతి ఒక్క సినిమా మేకర్ కూడా మంచి సినిమా తీయడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ఫెయిల్యూర్స్ గా నిలుస్తున్నాయి...

Written By: Gopi, Updated On : September 24, 2024 9:22 am

IMDB

Follow us on

IMDB: సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలను మంచి సినిమాలుగా నిలుపడానికి ఆ చిత్ర దర్శకులు విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి సందర్భంలోనే వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆ సినిమా తాలూకు ఇంటెన్స్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటాయి. ఇక మరి కొంతమంది దర్శకులు చేసే సినిమాల్లో వైవిద్యమైతే ఉండడమే కాకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాలకి ఐఎండిబి రేటింగ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటారు. ఒకసారి imdb లో మంచి రేటింగ్ కనక వచ్చినట్టయితే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయిందని దానికి ప్రేక్షకాదరణ కూడా ఎక్కువగా లభిస్తుందని మన భావించవచ్చు… నిజానికి ఐఎండిబి రేటింగ్ అంటే ఏంటి దీనివల్ల సినిమాలకు వచ్చే లాభమేంటి? అసలు టాప్ 5 ఐఎండిబి రేటింగ్ ను సంపాదించుకున్న సినిమాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

ఐఎండిబి అంటే ‘ఇంటర్నెట్ మూవీ డేటాబేస్’… చాలామంది మంచి సినిమాలు చూడాలి అనుకున్నప్పుడు ఇంటర్నెట్ లోకి వెళ్లి ఐఎండిబి రేటింగ్ ఉన్న సినిమాలను చూడడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఐఎండిబి లో ఒక్కసారి రేటింగ్ కనక ఎక్కువగా వచ్చినట్టయితే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అయిందని మనం భావించవచ్చు. ఇక మిగతా రివ్యూ రైటర్లు ఇచ్చే రివ్యూలు వాళ్ళ ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఉంటాయి. IMDB వాళ్ళు ఇచ్చే రేటింగ్ మాత్రం ఇంటర్నెట్ ని ఆధారంగా చేసుకొని ఆ సినిమా కంటెంట్ ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారు. దానివల్ల మంచి సినిమాలు చూడాలి అనుకునే వాళ్ళకి ఈ IMDB రేటింగ్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. దీని వల్ల ప్రేక్షకుడికి టైం వేస్ట్ అవ్వకుండా వాళ్లు మంచి సినిమాలు చూడటానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇక ఐఎండిబి రేటింగ్ లో టాప్ 5 లో ఉన్న సినిమాలు ఏంటి అంటే…

1. సందేశం

కేరళ సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్ ని బేస్ చేసుకొని వచ్చిన సందేశం సినిమా ఒక మంచి సినిమాగా నిలిచింది. ఐఎండిబి రేటింగ్ లో 10 రేటింగ్ కి గాను 9 రేటింగ్ ని సంపాదించుకొని టాప్ వన్ లో నిలిచింది…

2. 12 త్ ఫెయిల్

ఇక బాలీవుడ్ లో విద్ వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా ఐఎండీబీలో 8.8 రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమానే టాప్ లెవల్లో నిలవడం విశేషం…

3. కేరాఫ్ కంచేరపాలెం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ మహా అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా ఐఎండిబి ఎడిటింగ్ లో 8.8 రేటింగ్ ను సంపాదించుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

4. నాయకన్

కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకన్ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఐఎండిబి రేటింగ్ లో 8.7 రేటింగ్ సంపాదించుకొని టాప్ లెవెల్లో దూసుకుపోతుంది…

5. పరియారూమ్ పెరుమాళ్

మలయాళం సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇక మలయాళం ఇండస్ట్రీ లో వైవిధ్యమైన కథలు వస్తాయని చెప్పడంలో ఈ సినిమా చాలా వరకు యూజ్ అయింది. అయితే ఈ సినిమా కూడా 8.7 రేటింగ్ ను సంపాదించుకుంది…