Nagarjuna : కింగ్ నాగార్జున తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ సక్సెస్ లను సాధించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకు పెద్దగా సక్సెస్ అయితే రావడం లేదు. కారణం ఏదైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడంలో నాగార్జున మాత్రం ఈ మధ్యకాలంలో చాలావరకు వెనకబడిపోయాడనే చెప్పాలి. ఇక తన కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ కూడా వరుస సినిమాలను చేస్తున్నప్పటికి సక్సెస్ ఫుల్ గా నిలపలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా అక్కినేని ఫ్యామిలీ కొంతవరకు వెనకబడిపోయారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగార్జున పర్సనల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఇక తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక అందులో భాగంగా నాగార్జున భారీ వ్యయంతో కట్టుకున్న ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూలగొట్టారు. ఇక దాంతో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిన నాగార్జునకి తొందర్లోనే మరొక ఎదురు దెబ్బకు కూడా తగిలింది. అది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రిగా అధికార భాద్యతలను కొనసాగిస్తున్న కొండా సురేఖ సమంత, నాగార్జునను ఉద్దేశిస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలను చేశారు. ఇక దానికి అనుగుణంగానే నాగార్జున తీవ్రమైన కోపానికి లోనయ్యారు.
కొండా సురేఖ తొందర్లోనే వాళ్లకు సారీ చెప్పినప్పటికీ నాగార్జున మాత్రం దాన్ని చాలా ప్రస్టేజియాస్ ఇష్యూ గా తీసుకొని కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఇక ప్రస్తుతానికి కోర్టులో కొండ సురేఖ మీద 100 కోట్ల పరువు నష్టం ధావన్ వేశారు ఇక ఆ కేసు విషయంలో ఇవ్వాల నాగార్జున కోర్టులో హాజరు కాబోతున్నాడు…
మరి ఈ కేసు విషయంలో నాగార్జునకు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదంటే కొండా సురేఖ అధికార బలంతో కేసును తారుమారు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే నాగార్జున ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున తర్వాత తనదైన రీతిలో మళ్ళీ తన పరువును కాపాడుకోవాలంటే మాత్రం ఈ కేసులో నాగార్జున వైపే న్యాయం ఉంది అని నిరూపించుకోవాల్సిన అవసరమైతే ఉంది. చూడాలి మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది. పరువు నష్టం దావా కింద కొండ సురేఖ ఎలాంటి సంజాయిషీ ఇచ్చుకుంటుంది అనేది తెలియాల్సి ఉంటుంది…