Chiranjeevi – Venkatesh : చిరంజీవి, వెంకటేష్ కాంబోను సెట్ చేసే పనిలో ఉన్న సురేష్ బాబు…డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఎప్పుడైతే రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పెట్టి 'త్రిబుల్ ఆర్' సినిమా తీశాడో అప్పటినుంచి మల్టీ స్టారర్ సినిమాలకి ఎక్కువగా ఆదరణ అయితే లభిస్తుంది. ఇక దాంతో సీనియర్ హీరోలు సైతం నల్లటి స్టారర్ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది...

Written By: Gopi, Updated On : October 8, 2024 5:33 pm

chiranjeevi-venkatesh

Follow us on

Chiranjeevi – Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి… దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకచిత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక్క హీరో కూడా చిరంజీవే కావడం విశేషం… ఆయన లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికీ కూడా ఆయన చాలా కష్టపడుతూ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తన నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులందరిలో విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. మరి అలాంటి చిరంజీవి తన అభిమానులను సంతోష పెట్టడానికి వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఒక వేడుకలో చిరంజీవి ఓపెన్ గా తను వెంకటేష్ తో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దాంతో వెంకటేష్ వాళ్ళ అన్నయ్య అయిన సురేష్ బాబు వీళ్ళ కాంబోలో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఒక మంచి కథ కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే సురేష్ బాబు సెలక్షన్ అంటే చాలా బాగుంటుంది. కాబట్టి చిరంజీవి కూడా మంచి కథ దొరికితే చేద్దామని చెప్పారట.

ఇక దానికోసమే కొత్త కథలను వింటూ సురేష్ బాబు ఎప్పటికప్పుడు చిరంజీవికి చెబుతూనే వస్తున్నాడట. ఇక రీసెంట్ గా ఒక స్టార్ రైటర్ చెప్పిన కథ సురేష్ బాబుకి నచ్చడంతో చిరంజీవికి కూడా తెలియజేశారట. చిరంజీవి కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి చిరంజీవి, వెంకటేష్ ఎవరి సినిమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు.

కాబట్టి వాళ్ల సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తున్నారనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నిజానికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ ని ఈ సినిమా కోసం తీసుకురావాలని సురేష్ బాబు ప్రయత్నం చేస్తున్నాడు.

కానీ చిరంజీవి మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుడికే ఈ సినిమాని అప్పగించాలని ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కి ఈ సబ్జెక్ట్ ని అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ తొందర్లో వస్తుందా లేదా అనేది…