Director Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ ని తీయడంలో స్పెషలిస్ట్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు తేజ… కెరియర్ స్టార్టింగ్ లో రామ్ గోపాల్ వర్మ దగ్గర ‘శివ’ సినిమాకి అసిస్టెంట్ గా పని చేసిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి పలు విభిన్నమైన సినిమాలను చేశాడు. చిత్రం సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాడు… గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఏమాత్రం సక్సెసులైతే సాధించలేకపోతున్నాడు. మధ్యలో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ ఫామ్ ని ఎక్కువ కాలంపాటు కొనసాగించలేకపోయాడు…ఇక గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అది ఏంటి అంటే ‘నిజం’ సినిమాలో మహేష్ బాబును హీరోగా తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఆయన తెలియజేశాడు. నిజం కథకి ఒక పర్ఫార్మర్ కావాలి.
మహేష్ బాబు ను మించిన ఇంటెన్స్ పెర్ఫార్మ్ చేసే హీరో తెలుగులో లేడనే ఉద్దేశ్యంతో అతన్ని తీసుకున్నానని చెప్పాడు. కానీ మహేష్ చేసిన బాబీ సినిమా ఫ్లాప్ తర్వాత నిజం సినిమాని స్టార్ట్ చేశాను. మధ్యలో ఒక్కడు అనే ఒక సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో అతను మాస్ హీరోగా ఎలివేట్ అయ్యాడు.
ఇక అలాంటి మాస్ సినిమాను తీసిన మహేష్ బాబుతో నిజం సినిమా చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. అందులో అతను చాలా అమాయకమైన క్యారెక్టర్ లో కనిపిస్తాడు. ఇక చివరిలో తన తల్లి తనకు ఫైట్స్ నేర్పించడం ధైర్యాన్ని ఇవ్వడం లాంటివి చూసిన ప్రేక్షకులు మహేష్ బాబు మాస్ హీరో కదా తనకి తల్లి నేర్పడం ఏంటి అనే ఒక డిస్పాయింట్ మెంట్ తో సినిమాని ఓన్ చేసుకోలేకపోయారు. దాంతో సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
కమర్షియల్ గా సినిమా సక్సెస్ ని సాధించినప్పటికి ప్రేక్షకుడి మనసును మాత్రం గెలుచుకోలేకపోయిందని తేజ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. నిజానికి ఆ ప్లేస్ లో ఉదయ్ కిరణ్ గాని, నితిన్ లాంటి చిన్న హీరోలు ఉండి ఉంటే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయి ఉండేదని చెప్పాడు. అలాగే నిజం సినిమా కోసం నేను చాలా కష్టపడ్డానని తేజ చెప్పాడు. అలాగే మహేష్ కూడా చాలా బాగా నటించాడు. అలాగే తను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో నిజం సినిమాలో చేసిన పర్ఫామెన్స్ ఏ సినిమాలో చేయలేదని చెప్పడం విశేషం…