https://oktelugu.com/

Rajamouli: సినిమాల్లో కంటిన్యూటి మిస్టేక్స్ అంటే ఏంటి..?రాజమౌళి కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటాడా..? వీటిని నివారించడం ఎలా..?

సినిమా ఇండస్ట్రీ లో సక్సెసులు అనేవి చాలా అరుదుగా వస్థాయి. కానీ ఒకసారి సక్సెస్ వచ్చిన వ్యక్తి మాత్రం ఇక్కడ లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : September 17, 2024 / 03:01 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli: సినిమా తీయడం అనేది చాలా పెద్ద రిస్క్ తో కూడుకున్న పని.అయినప్పటికీ దర్శకుడు ఒక కథ ను తన మైండ్ లో ఎలాగైతే ఊహించుకున్నాడో అలాంటి ఒక ఊహకి దృశ్య రూపం కల్పించడమే సినిమాగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సందర్భంలో చాలామంది దర్శకులు వాళ్ళకి నచ్చిన జానర్లలో కథలను రాసుకొని సినిమాలను తెరకెక్కిస్తూ సూపర్ సక్సెస్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందరి సినిమాలు ఒకెత్తు అయితే, దర్శక ధీరుడిగా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న రాజమౌళి సినిమా మరొకెత్తు అనే చెప్పాలి. ఆయన భారీ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూనే, ఎమోషన్స్ ను చూపిస్తూ ఈ రెండిటిని సమపాళ్లల్లో బ్యాలెన్స్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లి సగటు ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఆ మూవీ ని తీర్చిదిద్దుతూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ఒక సినిమా షూట్ చేసేటప్పుడు ‘కంటిన్యూటి మిస్టేక్స్’ అనేవి జరుగుతూనే ఉంటాయి. అసలు కంటిన్యూటి మిస్టేక్స్ అంటే ఏంటి వాటి వల్ల సినిమాలకు ఎలా డ్యామేజ్ జరుగుతుంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

    ఒక సినిమాలోని ఒక సీన్ కు సంబంధించిన కొన్ని షాట్స్ ని ఒకసారి తీస్తే, దాని తరువాత వచ్చే షాట్ ను మరొకసారి తీస్తారు. అంటే కెమెరా ఒక యాంగిల్ లో ఉన్నప్పుడు ఆ యాంగిల్ షాట్స్ మొత్తం ఒకేసారి తీస్తారు. ఇంకొక సైడ్ కెమెరా పెట్టినప్పుడు ఆ సైడ్ ఉన్న షాట్స్ మొత్తం ఒకేసారి తీస్తారు. ఇలా ఒక సీన్ ని డిఫరెంట్ యంగిల్స్ లో చాలా రోజులపాటు తీస్తూనే ఉంటారు. అలా చేయడం వల్ల ఒక షాట్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటే ఇంకొక యాంగిల్ నుంచి తీసిన మరొక షాట్ లో అవి కాకుండా వేరే ప్రాపర్టీస్ ఉంటాయి. లేదా అక్కడ ఏమి ఉండవు. అలాంటి వాటినే కంటిన్యూటి మిస్టేక్స్ అంటారు. ఒక షాట్ లో హీరో పక్కన గాని, హీరోయిన్ పక్కన గాని కొంతమంది ఆర్టిస్టులు ఉంటే మరొక షాట్ ను మరొక యాంగిల్ లో తీసినప్పుడు వాళ్ళ పక్కన వేరే వాళ్ళు ఉంటారు.

    ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. చాలామంది దర్శకులు వీటిని నివారించే ప్రయత్నం చేసినప్పటికీ ఒక షాట్ కి, మరొక షాట్ కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఎంత ప్రయత్నం చేసిన కూడా కంటిన్యూటి మిస్టేక్స్ ను నివారించడం చాలా కష్టతరం అవుతుంది. నిజానికి చాలా మంది దర్శకులు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉండటం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాము. కానీ దర్శక ధీరుడు అయిన రాజమౌళి సైతం ఇలాంటి మిస్టేక్స్ చేస్తాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. రాజమౌళి సినిమాలు ఎమోషన్స్ తో ముందుకు సాగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటిని ఎవరు పట్టించుకోరని ఆయన చెబుతూ ఉంటాడు.

    రాజమౌళి సైతం తన సినిమాలో కంటిన్యూటి మిస్టేక్స్ లేకుండా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడక్కడ అలాంటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయని రాజమౌళి స్వయంగా తనే చెప్పాడు. ఇక అలాంటి స్టార్ డైరెక్టర్ కూడా తన సినిమాల్లో ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయని ఒప్పుకోవడం అనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తిని నెలకొల్పుతుంది. ఆయన చేసిన మగధీర, బాహుబలి సినిమాల్లో చాలా సీన్స్ లలో ఇలాంటి మిస్టేక్స్ జరిగాయి…

    మరి ఇలాంటి మిస్టేక్స్ వల్ల సినిమా ప్లాప్ అవుతుందా అంటే అలాంటిది ఏది జరగపోయిన కూడా వీటిని డైరెక్టర్ చేసిన మిస్టేక్స్ గా ప్రేక్షకులు భావిస్తారు. కాబట్టి ప్రేక్షకుల దృష్టి లో డైరెక్టర్ల మీద కొంత వరకు గౌరవం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇలాంటి వాటిని నివారించడానికి ఏం చేయాలి అంటే డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఉన్న ఒక అసోషియేట్ డైరెక్టర్ ను ప్రత్యేకించి ఇవి చూసుకోవడానికి పెట్టుకోవాలి.

    దానివల్ల ఆయన ప్రతి షాట్ ని ఫోటో తీసుకొని చూస్తూ ఎవరి పొజిషన్ ఏంటి ఎవరు ఎక్కడ ఉండాలి. ఈ ప్రాపర్టీ ఏ పొజిషన్ లో ఉంది అనేది చెబుతూ ఉంటాడు. దాని వల్ల ఇలాంటి మిస్టేక్స్ కి కొంత వరకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. నిజానికి షూటింగ్ స్పాట్ లో డైరెక్టర్ ఇవన్నీ చూసుకోవడానికి సమయం ఉండదు కాబట్టి ఇలా చేయడం మంచిది…