Tollywood Comedian : సినిమా అంటే కేవలం హీరోహీరోయిన్ మాత్రమే ఉంటే సరిపోదు. పెద్ద టీమ్, కో యాక్టర్స్ ఇలా చాలా మంది కలయికతో సినిమా అవుతుంది. ఇందులో విలన్స్ ఎంత ముఖ్యమో.. కమెడియన్స్ కూడా అంతేముఖ్యం. ఒకప్పుడు సినిమాలు చూసుకుంటే.. అందులో కమెడియన్స్ ఎంతమంది ఉన్నారు అని కౌంట్ చేయడం కూడా కష్టంగానే ఉండేది. కానీ ఇప్పుడు సినిమాలో కమెడియన్స్ ఉన్నారా? అనేలా మారిపోయింది సినిమా. కానీ కొందరు మాత్రం రిపీట్ గా వస్తుంటారు. వారి హాస్యానికి జనాలు కూడా అట్రాక్ట్ అయ్యారు. వారిని వారు తక్కువ చేసుకున్నా సరే కామెడి మాత్రం సూపర్ గా ఉంటుంది. అందరితో తిట్లు తిన్నా సరే ప్రేక్షకులను మాత్రం నవ్విస్తుంటారు. మరి ఈ కాలం మంచి కమెడియన్ ఎవరు అంటూ చాలా మందికి ఠక్కున గుర్తు వచ్చే పేరు సత్య.
మత్తు వదలరా 2 తరువాత సత్య కామెడీకి ఫ్యాన్స్ అయ్యారు. తెలుగుసినిమాకి దొరికిన ఆణిముత్యం అనే పేరు సంపాదించారు సత్య. మరో బ్రహ్మానందం అంటూ పొగిడేస్తున్నారు. ఈ సత్య గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అమలాపురం కుర్రాడు సత్య పూర్తిపేరు సత్య ఆకుల. చదువు పూర్తిచేసి.. ఇండస్ట్రీలోకి వెళ్లాలని కోరుకున్నాడు. ఆ సమయంలో థియేటర్ లో వేణు మాధవ్ నటించిన భూ కైలాస్ సినిమా చూడటానికి వెళ్లాదడట. అక్కడ ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుకోవడం విన్నాడట సత్య.ఇక వారితో పరిచయం పెంచుకున్నాడు. వెళ్లేముందు వారు.. రేపు షూటింగ్ కు రమ్మని చెప్పారట. దీంతో ఉదయాన్నే రూ.500 తీసుకుని జూనియర్ ఆర్టిస్టుగా అతన్ని ఓ సినిమా షూటింగ్‌కి పంపించడంతో ఆనందించాడట. అక్కడకు వెళ్లిన సత్య వద్దనుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ డబ్బులు తీసుకొని పారిపోవడంతో సత్య బిత్తర పోయాడట. చేతిలో డబ్బులు లేక మూడురోజులు తినకుండా ఉండిపోయాడట సత్య.
ఆకలికి తట్టుకోలేక తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడట. అలా సత్య తండ్రి హైదరాబాద్ వచ్చి.. తనకు తెల్సిన ఫ్రెండ్ రాజమౌళి వద్ద పని చేస్తుంటే అతనివద్దకు పంపించాడట. అలా నితిన్ హీరోగా నటించిన ద్రోణ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ముందుగా తన సినీ ప్రయాణం ప్రారంభించాడు. ఆ తరువాత ఫేమస్ కామెడీ సీరియల్ అమృతం కు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించడంతో చాలా మంది అభిమానులు పెరిగిపోయారు. పిల్ల జమీందార్, గబ్బర్ సింగ్, స్వామి రారా.. వంటి సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలో నటించారు. ఇక సత్యను కమెడియన్ గా మార్చింది మాత్రం ఛలో సినిమా అని చెప్పడంలో సందేహం లేదు. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో సత్య కామెడీకి ఫుల్ అభిమానులు పెరిగారు. ఈ సినిమాకు గాను బెస్ట్ కమెడియన్ అవార్డ్ అందుకున్నారు సత్య. ఒకప్పుడు కమెడియన్ అంటే సునీల్, బ్రహ్మానందం అని ఠక్కున చెప్పేవారు. కానీ ఇప్పుడు వారి స్థానంలో సత్య చేరారు. సో ఇది ఆయనకు మంచి విజయం అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఈయన లేని సినిమా లేదు అన్నట్టుగా కూడా మారిపోయింది. మొత్తం మీద ఇదండీ సత్య స్టోరీ.