Pawan Kalyan Career: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ని సంపాదించి పెట్టడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేశాయి. మరి ఇలాంటి సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ కి సినిమాల్లోకి రావడం ఇష్టం లేకపోయిన కూడా కేవలం చిరంజీవి కోరిక మేరకు మాత్రమే ఇండస్ట్రీకి వచ్చాడు. ఒకవేళ ఆరోజు చిరంజీవి కనక ఇండస్ట్రీకి తీసుకురాకపోయి ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చాలామంది అభిమానులు మిస్ అయిపోయేవారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయనను మనం చూసే వాళ్ళం కాదంటూ చాలామంది అభిమానులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు సైతం మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇదొక్కటే మైనస్ అయిందా..?
సినిమా కెరియర్ లోనే కాకుండా రాజకీయ కెరియర్ లో కూడా చిరంజీవి చాలా కీలకపాత్ర వహించాడు. ప్రజారాజ్యం పార్టీని పెట్టి యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ నియమించడంతో ఆయన జనాలతో మమేకమయ్యాడు. దానివల్ల రాజకీయాలు ఎలా ఉన్నాయి, నాయకులు ఎవరితో ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు.
జనాలు ఎంత స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తున్నారు అనే విషయాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే జనాలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ‘జనసేన’ పార్టీని స్థాపించి అప్పటినుంచి ఇప్పటివరకు ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్నాడు. మొత్తానికైతే డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళుతున్న పవన్ కళ్యాణ్ ఇకమీదట కూడా జనాలకు సేవ కార్యక్రమాలను అందించాలని అలాగే వాళ్ళ సమస్యలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
ఇక పవన్ కళ్యాణ్ సైతం ఇప్పటికీ తనకు సినిమాల పరంగా అయిన, రాజకీయాల పరంగా అయిన చిరంజీవి తనకు ఇన్స్పిరేషన్ అని ఆయన లేకపోతే తను ఇక్కడ ఉండేవాడిని కాదని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కి చిరంజీవి అంటే ఎంత ఇష్టమో మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు…