Teacher Eligibility Test: ప్రభుత్వ ఉపాధ్యాయులకు( government teachers) షాక్ తగిలింది. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇప్పుడు ఉపాధ్యాయులను సంశయం లో నెట్టింది. ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభావం చూపుతోంది. 2009 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పాస్ కావాల్సిందే అంటోంది సుప్రీంకోర్టు. పదోన్నతి పొందాలన్నా టెట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అయితే తమిళనాడుకు చెందిన ఓ కేసులో ఈ తీర్పురాగా.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ తీర్పు వర్తిస్తుందన్న టాక్ ప్రారంభం అయింది.
Also Read: పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇదొక్కటే మైనస్ అయిందా..?
* దేశవ్యాప్తంగా చర్చ..
2009 ముందు ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్( teacher eligibility test) పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఒకవేళ టెట్ పాస్ కాని ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉద్యోగం నుంచి తొలగిస్తారు. వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇస్తారు అని కోర్టు స్పష్టం చేసింది. అయితే 2009 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ఒక వెసులుబాటు కల్పించింది కోర్టు. పదవీ విరమణకు ఐదేళ్ల లోపు సర్వీస్ ఉంటే వారికి టెట్ అవసరం లేదు. అయితే పదోన్నతి కావాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సి ఉంటుంది.
* ఏపీలో డీఎస్సీకి ముందు టెట్
టెట్ అనేది ఉపాధ్యాయ అర్హతను నిర్ధారించే పరీక్ష. అయితే ఏపీకి( Andhra Pradesh) ఈ నిబంధన వర్తిస్తుందా? లేదా? అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. తమిళనాడులో ఓ కేసుకు సంబంధించిన తీర్పు విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఏపీలో డీఎస్సీ నియామకాలకు ముందు టెట్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు అదే నిబంధనను దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లకు అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. అయితే 2009 ముందు ఉపాధ్యాయులుగా ఎంపికైన వారి విషయంలో మాత్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ తీర్పు కేవలం తమిళనాడుకు పరిమితమా? ఏపీ తో పాటు ఇతర రాష్ట్రాలకు వర్తిస్తుందా? లేదా? అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.