Vishal : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విశాల్…ఈయనకి తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే ఉంది. మరి ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా విశాల్ లాంటి నటుడు అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లో కూడా అద్భుతమైన నటన తీరును కనబరిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. ఇప్పుడు ఆయన రీసెంట్ గా ‘మదగదరాజ’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించారు. 2013 లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుండటం విశేషం…అయితే ఈ ఈవెంట్ లో విశాల్ ను చూసిన యావత్ తమిళ్, తెలుగు ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే ఆయన చాలా సన్నబడిపోయి, నడవలేని స్థితిలో నిదానంగా నడుస్తూ చేతులు వణుకుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు చాలా బాధపడిపోయారు. మరి ఏది ఏమైనా కూడా ఆయన తన ఆరోగ్యం పట్ల చాలా వరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయినప్పటికి అతనికి అలా ఎందుకు జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఆయన గురించి చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయనకి గత కొద్ది నెలల నుంచి ఆరోగ్యం అయితే అసలు బాగుండడం లేదట.
దానివల్లే ఆయన అర్జున్ రెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ‘అనీషా రెడ్డి’ అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకొని ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయిన తర్వాత మరో 10 రోజుల్లో పెళ్లి ఉంది అనగా ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశారు. కారణం ఏంటి అంటే అతనికి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్లే ఆ పెళ్లిని క్యాన్సల్ చేసినట్టుగా వాళ్ల కుటుంబ సభ్యులు తెలియజేశారు…
అయితే కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన మెదడులో ఉన్న నరాలు కొంతవరకు డ్యామేజ్ అయ్యాయని దానివల్ల ఆయనకి విపరీతమైన తల నొప్పి ఉండటమే కాకుండా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది…ఇక ఫారన్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన తొందర్లోనే క్యూర్ అవుతాడని వైద్యులు చెబుతున్నారు…
ఇక ఒకప్పుడు స్ట్రాంగ్ గా ఉండి హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విశాల్ ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉండడం అనేది యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికీ ఆయన దానికి సంబంధించిన ట్రీట్ మెంట్ ని తీసుకుంటున్నప్పటికి ఆయన తొందర్లో క్యూర్ అయి మళ్ళీ మంచి సినిమాలు చేయాలని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు…