https://oktelugu.com/

Sankranti : ఈ సంక్రాంతి సినిమాల్లో ఏ మూవీ ట్రైలర్ బాగుంది…ఎవరు భారీ సక్సెస్ ను కొట్టబోతున్నారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. అయితే వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు కూడా అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతూ ఉండటం అనేది విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : January 7, 2025 / 10:15 AM IST

    Game changer

    Follow us on

    Sankranti : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు సినిమాల మీద సినిమాలు రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీగా ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సంవత్సరం రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య బాబు డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం అనే మూడు సినిమాలతో ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి మన స్టార్ హీరోలు రెఢీ అయ్యరు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాలను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మూడు సినిమాల నుంచి ఇప్పటికే ట్రైలర్లు అయితే రిలీజ్ అయ్యాయి. మరి ఈ ట్రైలర్లు ఎలా ఉన్నాయి. సగటు ప్రేక్షకుడిని ఆకర్షించాయా లేదా ఈ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

    మొదట ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన ట్రైలర్ యావత్ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంది. నిజానికి ఈ సినిమా రామ్ చరణ్ కి చాలా కొత్త అనుభూతిని ఇవ్వబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసి రామ్ చరణ్ కి మరోసారి పట్టం కట్టబోతున్నారో అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఆధ్యాయంతం ఆసక్తికరంగా ఉండడమే కాకుండా సినిమాలో ఉండే అన్ని ఎమోషన్స్ ని ఈ ట్రైలర్ కట్ లో చాలా బాగా చూపించారు…

    ఇక బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ ట్రైలర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే బాలయ్య అంటేనే యాక్షన్ ఎపిసోడ్స్ కి పెట్టింది పేరుగా మారారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఎంజాయ్ చేయడంలో ఆయనను మించినటువంటి నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మాస్ అంశాలను కలబోసి యాక్షన్ ఎపిసోడ్స్ కి పెద్ద పీట వేస్తూ డైరెక్టర్ బాబీ ఈ సినిమాని తెరకెక్కించాడనే విషయం అయితే మనకు ట్రైలర్ చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది.

    అయితే ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఒక పాప మీదనే ఈ సినిమా మొత్తం డిపెండ్ అయి ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి నటుడు ప్రస్తుతం సంక్రాంతి విన్నర్ గా నిలవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు…

    ఇక వెంకటేష్ హీరోగా వస్తున్న ‘సంక్రాంతి వస్తున్నాం’ అనే సినిమాతో యావత్ ప్రేక్షకులందరిని అట్రాక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ని కనక మనం చూసినట్లయితే మొదటినుంచి చివరి వరకు యావత్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా ట్రైలర్ అయితే ఉంది. కామెడీ ఎంటర్టైనర్లను తెరకెక్కించే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి కామెడీకి కూడా పెద్ద పీట వేసినట్టుగా తెలుస్తోంది. చిన్న చిన్న డీటేలింగ్ ని కూడా ఇందులో చాలా అద్భుతంగా వాడుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ట్రైలర్ అయితే ఇంట్లో ఇల్లాలు, పోలీస్ స్టేషన్ లో ప్రియురాలు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కినట్టుగా తెలుస్తోంది…

    ఇక ప్రస్తుతానికైతే ఈ మూడు ట్రైలర్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి సినిమాలు కూడా ఇదే మాదిరిలో ప్రేక్షకులను ఆకట్టుకొని సక్సెస్ సాధించాయి. ఈ సంవత్సరం మొదట్లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారీ విజయాలను అందించి పెడతాయని యావత్ సినిమా ప్రేక్షకులంతా ఆశిస్తున్నారు…