Ram Gopal Varma: ఆర్జీవీ శిష్యులందరూ ఇలానే ఉంటారా..? అసలు వీళ్ళకి ఏమైంది.. ఎందుకు ఇలా చేస్తున్నారు..?

ఈయన దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన చాలా మంది దర్శకులు ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. అందులో తేజ, కృష్ణవంశీ, గుణశేఖర్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు ప్రముఖంగా ఉన్నారు.

Written By: Gopi, Updated On : May 11, 2024 2:40 pm

What happened to the Ram Gopal Varma batch

Follow us on

Ram Gopal Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో 1990వ సంవత్సరంలో శివ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ‘రామ్ గోపాల్ వర్మ’…ఇక అప్పటినుంచి ఆయన హవా మొదలైందనే చెప్పాలి. కొత్త తరం కథతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగాయి.

ఇక ఈయన దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన చాలా మంది దర్శకులు ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. అందులో తేజ, కృష్ణవంశీ, గుణశేఖర్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు ప్రముఖంగా ఉన్నారు. ఇక వీళ్లలో దర్శకులందరూ కూడా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ వీళ్లు చేసే సినిమాలు సక్సెస్ అయిన, అవ్వకపోయిన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక వీళ్ళు కొంచెం కొత్త జానర్ లో సినిమాలను చేస్తే బాగుంటుంది కదా అంటూ సగటు ప్రేక్షకుడు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తేజ, గుణశేఖర్ అయితే మాకు నచ్చింది మేము తీస్తాం, మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు అన్నట్టుగా వాళ్లకు నచ్చిన సినిమాలు చేస్తూ వస్తున్నారు.

ఇక వర్మ కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతూ సినిమాలు చేస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఇదంతా చూస్తున్న తెలుగు సినిమా ప్రేక్షకులందరూ వర్మ బ్యాచ్ కి ఏమైంది ఎందుకు వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలను చేయలేకపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లైతే చేస్తున్నారు…

మరి ఇప్పటికైనా వీళ్లు మారి ఈ జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలు చేస్తే బాగుంటుందంటూ పలువురు సినీ ప్రముఖులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి వీళ్లంతా మంచి టాలెంట్ ఉన్న దర్శకులు ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని స్టార్ హీరోలతో సైతం సినిమాలను చేసి మెప్పించారు. మరి అలాంటి వారు ఇప్పుడు ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు…