https://oktelugu.com/

ల్యాప్ ట్యాప్ బుక్ చేస్తే అమెజాన్ ఏమిచ్చిందో తెలుసా?

ఆమెజాన్ నుంచి చాలా మంది ఆన్ లైన్ లో వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో అమెజాన్ భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. రోహన్ దాస్ అనే వ్యక్తి ఆమెజాన్ ద్వారా ఏప్రిల్ 30న లెనోవా ల్యాప్ టాప్ ను కొనుగోలు చేశాడు. దీని విలువ అక్షరాల లక్ష రూపాయలు. రోహన్ దాస్ బుకింగ్ చేసిన సమయానికే అంటే మే 7నాటికి ల్యాప్ టాప్ ఇంటికి వచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 11, 2024 / 02:34 PM IST

    amazon laptop

    Follow us on

    చేతిలోకి మొబైల్ వచ్చాక ప్రతి ఒక్కరూ నిత్యం ఆన్ లైన్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే సమయంలో కూర్చొన్న చోటే షాపింగ్ చేస్తూ ఇంటికి వస్తువులను తెచ్చుకుంటున్నారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఫ్లిప్ కార్ట్, ఆమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఆన్ లైన్ ద్వారా వస్తువులను వినియోగదారుల ఇంటికి చేరవేరుస్తున్నారు. బయట షాపుల కంటే ఆన్ లైన్ లో ధర తక్కువగా ఉండడంతో పాటు ఫ్రీ డెలివరీ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. దీంతో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ కు అలవాటుపడ్డారు. అయితే ఓ వినియోగదారుడు ఆన్ లైన్ షాపింగ్ చేయడం ద్వారా అతనికి వింత అనుభవం ఎదురైంది? అసలేం జరిగిందంటే?

    ఆమెజాన్ నుంచి చాలా మంది ఆన్ లైన్ లో వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో అమెజాన్ భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. రోహన్ దాస్ అనే వ్యక్తి ఆమెజాన్ ద్వారా ఏప్రిల్ 30న లెనోవా ల్యాప్ టాప్ ను కొనుగోలు చేశాడు. దీని విలువ అక్షరాల లక్ష రూపాయలు. రోహన్ దాస్ బుకింగ్ చేసిన సమయానికే అంటే మే 7నాటికి ల్యాప్ టాప్ ఇంటికి వచ్చింది. ఎంతో సంతోషంతో ఆ ప్యాక్ అందుకున్న అతడు ల్యాప్ ట్యాప్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు.

    అందులో ల్యాప్ టాప్ ఉంది. కానీ దానిని ఇదివరకే యూజ్ చేశారు. అంటే అది సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్. తాను రూ.లక్షతో కొత్త ల్యాప్ టాప్ బుక్ చేయగా.. ఇదివరకే వాడిన ల్యాప్ టాప్ పంపడంపై ఆమెజాన్ పై రోహన్ దాస్ ఫైర్ అయ్యాడు. ఈ సందర్భంగా అతడు సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను పంచుకున్నాడు. దీంతో ఆయనకు సపోర్టుగా చాలా మంది కామెంట్స్ చేశారు. ఆమెజాన్ లో అన్నీ మోసాలే.. అంటూ తిట్టిపోశారు.

    ఈ విషయం వైరల్ కావడంతో ఆమెజాన్ స్పందించింది. తాను చేసిన తప్పుకు క్షమాపణలు కోరింది. ఆ తరువాత కొందరు లెనోవా కంపెనీని సంప్రదించాలని తెలిపారు. దీంతో రోహన్ దాస్ లెనోవా కంపెనీని విషయం చెప్పగా.. కొనుగోలు దారుడు ల్యాప్ ట్యాప్ కొనుగోలు చేసినప్పటి నుంచి గ్యారెంటీ లభిస్తుందని స్పష్టం చేవారు. ఏదీ ఏమైనా ఆన్ లైన్ లో వస్తువులు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.