https://oktelugu.com/

కనీవినీ ఎరుగని ‘కార్ల’ ఆఫర్లు.. వెంటనే త్వరపడండి..

టాటా కంపెనీ నుంచి వచ్చిన సఫారీ ఫ్రీ పేస్ లిప్ట్ నుంచి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మోడల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ తో ప్రయాణిస్తుంది. 170 బీహెచ్ పీ పవర్, 350 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల తగ్గింపును ప్రకటించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 11, 2024 / 02:41 PM IST

    Tata motors summer offer

    Follow us on

    దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి ప్రముఖంగా నిలుస్తుంది. ఇప్పుడు మారుతికి పోటీగా టాటా మోటార్స్ గట్టి పోటీ ఇస్తోంది. ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఎస్ యూవీ కార్లను తీసుకురావడంతో టాటా మోటార్స్ ముందుంటుంది. అయితే ఎస్ యూవీ కార్లు అనగానే కాస్త ధర ఎక్కువగా ఉంటాయి. అయితే వీటి సేల్స్ పెంచేందుకు కంపెనీ ఒక్కోసారి ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా సమ్మర్ సందర్భంగా టాటా మోటార్స్ కొన్ని మోడళ్లపై కనివినీ ఎరుగని ఆఫర్లను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..

    టాటా కంపెనీ నుంచి వచ్చిన సఫారీ ఫ్రీ పేస్ లిప్ట్ నుంచి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మోడల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ తో ప్రయాణిస్తుంది. 170 బీహెచ్ పీ పవర్, 350 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల తగ్గింపును ప్రకటించింది. ఇందులో 75,000 నగదు డిస్కౌంట్, రూ.50 వేలు ఎక్చేంజ్ బోనన్ ఉన్నాయి. అయితే ఈ తగ్గింపు అడాస్ టెక్నాలజీ ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ పై మాత్రమే వర్తిస్తుంది. అడాస్ లేని వాటిపై రూ. లక్ష వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

    టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ బాగా ఫేమస్ అయింది. ఈ మోడల్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లో 120 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ లో 115 బీహెచ్ పీ పవర్ ను ప్రొడ్యూస్ చేయనుంది. ఈ మోడల్ పై మే నెల చివరి నాటికి రూ.90 వేల తగ్గింపును పొందవచ్చు. అయితే 2023 అక్టోబర్, డీసెంబర్ మధ్య తయారయిన వాటికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

    టాటా కంపనీ నుంచి పంచ్ బెస్ట్ మోడల్ లగా నిలిచింది. పంచ్ 1.2 లీటర్ పెట్రోల్ వెర్షన్ లో 88 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్ జీ విషయానికొస్తే 74 బీహెచ్ పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. పంచ్ 2023 మోడల్ పై రూ.10 వేల నదు తగ్గింపును ప్రకటించింది. మారుతి కార్లకు గట్టి పోటీనిచ్చిన వాటిల్లో పంచ్ మొదటిస్థానంలో ఉంది.