Yellamma Movie Venu: సినిమా ఇండస్ట్రీలోకి కామెడీ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన నటుడు వేణు… వరుస సినిమాలు చేస్తూ నటుడిగా చాలా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. మున్నా సినిమాలో ఆయన చేసిన టిల్లు పాత్ర అతనికి భారీ ఇమేజ్ ను సంపాదించి పెట్టడమే కాకుండా టిల్లు వేణు గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో జబర్దస్త్ షో ద్వారా తన కామెడీని పండించే ప్రయత్నం చేశాడు. ఇక దానికి అనుగుణంగానే ఆయన చేసిన ప్రతి స్కిట్ లో కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సంపాదించుకున్నాడు. కుటుంభ బాంధవ్యాల మీద ఆయన రాసుకున్న బలగం అనే కథకి తనే దర్శకత్వం వహించి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు.nఇక అతని నుంచి రాబోతున్న రెండో సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో ఎవరు అనే దాని మీద సరైన క్లారిటీ రావడం లేదు. మొదట నానితో ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ నాని కి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల తను ఈ సినిమాకి నో చెప్పాడు.
ఆ తర్వాత నితిన్ ఈ సినిమాలోకి వచ్చి చేరాడు. అతను కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక ఆయన తర్వాత శర్వానంద్ పేరు వినిపించింది. తను కూడా ఈ సినిమా చేయడం లేదనే వార్తలైతే వచ్చాయి. ఆ తర్వాత తమిళ్ హీరో అయిన ధనుష్ పేరు కూడా వినిపించింది. ఇక ఇప్పుడు వీళ్ళు ఎవరు కాకుండా ‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్’ ఈ సినిమాని చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
నిజానికి ఎల్లమ్మ సినిమా గ్రాఫ్ అనేది ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. మొదట నానిని హీరోగా అనుకున్నప్పుడు ఈ సినిమాకి భారీ మార్కెట్ క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు ‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్’ అనేసరికి ఈ మూవీ మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్ గా ‘కిష్కింధపురి’ అనే సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు.
అయినప్పటికి ఆయన మార్కెట్ అనేది పరిమితంగానే ఉంది. ఇక నటన విషయంలో కూడా బెల్లంకొండ మీద చాలా విమర్శలైతే ఉన్నాయి. ఇక ఎల్లమ్మ అనే ఒక విలేజ్ టైటిల్ ని పెట్టి సినిమా చేస్తున్నప్పుడు హీరో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడాల్సి ఉంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఆ స్లాంగ్ మాట్లాడుతాడా? తను ఆ పాత్రలో ఎలా నటిస్తాడు అనే విషయంలో కూడా చాలా వరకు ప్రేక్షకుల్లో కొన్ని అనుమానాలైతే రేకత్తింపజేస్తున్నాయి… ప్రస్తుతం నెటిజన్లు సైతం ఎల్లమ్మ సినిమా పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారైంది… ఎందుకని ఈ సినిమాకి హీరోలు దొరకడం లేదు.రోజులు గడుస్తున్న కొద్ది ఇంతలా దిగజారిపోతోంది అసలు ఈ సినిమా చేస్తారా లేదా అంటూ కొన్ని విమర్శలు చేస్తున్నారు…