Ram Charan Beats Prabhas And Allu Arjun: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు మన సినిమాలని హేళన చేస్తు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అలాంటి వారే తెలుగు సినిమాల గురించి చాలా గొప్పగా మాట్లాడుతుండటం విశేషం…మన దర్శకులతో సినిమాలు చేయడానికి అక్కడి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. మన దర్శకులతో ఒక్క సినిమా చేస్తే చాలు ఇండస్ట్రీ హిట్లను కొట్టొచ్చు అని బాలీవుడ్ దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇద్దరు స్టార్ హీరోలు పాన్ ఇండియాలో చక్రం తిప్పుతున్నారు. అందులో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటే అల్లు అర్జున్ తర్వాత స్థానంలో ఉన్నాడు… ఇక వీళ్లిద్దరు ఎప్పటికప్పుడు మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. పుష్ప సిరీస్ తో అల్లు అర్జున్ సైతం బాలీవుడ్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు.
వీళ్ళిద్దరు పాన్ ఇండియా వైడ్ గా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు. ఇక వీళ్ళిద్దరిని బీట్ చేయగలిగే కెపాసిటి మరొక తెలుగు హీరోకి ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే రామ్ చరణ్… ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేసే విధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్, అల్లు అర్జున్ సైతం పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా ఎదిగినప్పటికి వాళ్లను బీట్ చేస్తూ వాళ్లకంటు స్టార్ హీరోగా మారగలగే కెపాసిటి రామ్ చరణ్ కి మాత్రం ఉందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…
కెరీర్ మొదట్లో యాక్టింగ్ విషయంలో రామ్ చరణ్ చాలావరకు వెనుకబడిపోయినప్పటికి ఇప్పుడు చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ తన నటనలో కూడా పరిణితిని చూపిస్తున్నాడు. అందువల్లే అతని సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు చేస్తున్న సినిమాల మీద భారీ ఆశలైతే పెట్టుకున్నారు. చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాగైతే నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదిగాడో రామ్ చరణ్ సైతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…